విజయవంతంగా ముగిసిన జనసేన పార్టీ అధికార ప్రతినిధుల శిక్షణా వర్క్ షాప్
Bharat Today: విజయవాడలో రెండు రోజుల పాటు జరిగిన జనసేన పార్టీ అధికార ప్రతినిధుల శిక్షణ వర్క్‌షాప్ విజయవంతంగా ముగిసింది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలతో, నాయకులకు వివిధ అంశాలపై శిక్షణ అందించేందుకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో అధికార ప్రతినిధులు మీడియా చర్చల్లో బాధ్యతాయుతంగా, సమర్థంగా పాల్గొనే నైపుణ్యాలను పెంపొందించుకున్నారు. ఎంపికైన వారు అధికార ప్రతినిధులుగా బాధ్యతలు స్వీకరించి, పార్టీ భావజాలాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు.



