Home » Andhra Pradesh » రాయలసీమను స్పోర్ట్స్ హబ్‌గా మారుస్తాం: తిరుపతిలో ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్

రాయలసీమను స్పోర్ట్స్ హబ్‌గా మారుస్తాం: తిరుపతిలో ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్

Published By: BharattodayTV Team
Published On
IND vs SA T20

Bharat Today: తిరుపతి గొల్లవానిగుంటలో ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ప్రారంభించిన అనంతరం ఎన్టీఆర్ క్రికెట్ స్టేడియంలో జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులతో సమావేశం అయ్యారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి 90రోజుల కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. క్రీడాకారులు, క్రీడారంగ నిపుణుల అభిప్రాయాలను సేకరిస్తాం. రాయలసీమను స్పోర్ట్స్ హబ్ గా చేస్తాన‌ని ఇచ్చిన హామీ త్వ‌రలో కార్య‌రూపం దాల్చుతుందని ఈ సందర్భంగా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో పోటీపడి పథకాలు సాధించేలా తగిన సౌకర్యాలు కల్పిస్తామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు.  

 

Share to...