బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి ఒక నిండు ప్రాణాన్ని కాపాడేందుకు స్వయంగా 60 అడుగుల నీటి ట్యాంకు ఎక్కి, ఆ విద్యార్థినికి కౌన్సెలింగ్ ఇచ్చి సురక్షితంగా కిందకు తీసుకురావడం అభినందనీయం… అని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ కొనియాడారు. ప్రాణాలకంటే ఏదీ ముఖ్యం కాదని చాటిచెప్పిన ఆమె సమయస్ఫూర్తి ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. విద్యార్థులారా.. తల్లిదండ్రులు మీ మంచి కోసమే చెబుతారు. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు మీ కుటుంబాన్ని తీరని వేదనకు గురిచేస్తాయి. జీవితం చాలా విలువైనది, పోరాడి గెలవాలి కానీ ఇలా మధ్యలోనే వదిలేయకూడదు… అంటూ కమిషనర్ సజ్జనార్ యువతకు హితవు పలికారు.



