Home » Latest » ఏపీ ఉగాది వేడుకలు 2026: విజయవాడలో సీఎం చంద్రబాబు ఉగాది పురస్కారాల ప్రదానం – పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు.

ఏపీ ఉగాది వేడుకలు 2026: విజయవాడలో సీఎం చంద్రబాబు ఉగాది పురస్కారాల ప్రదానం – పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు.

Published By: BharattodayTV Team
Published On
IND vs SA T20

విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు , మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. పరాభవ నామసంవత్సరం ప్రజలందరికీ మంచి చేయాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. తెలుగు సంస్కృతి వినూత్నం, పండుగలు విభిన్నం. ప్రకృతిని ఆరాధించడం, ఆరోగ్యకరమైన జీవన విధానానికి ఇవి ప్రతీకలు అని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. వివిధ రంగాల్లో విశిష్ట కృషి చేసిన కళాకారులు, సాహితీవేత్తలు, పాత్రికేయులు, ప్రముఖులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉగాది పురస్కారాలు అందించారు. సాహిత్యం, సంగీతం, కళలు, సామాజిక సేవ రంగాల్లో ఉగాది కళారత్న పురస్కారాలను సీఎం అందించారు. 38 మంది కళారత్న, 122 మంది ఉగాది పురస్కారాలను ముఖ్యమంత్రి చేతుల మీదుగా అందుకున్నారు.

 

Share to...