Home » Andhra Pradesh » ఏప్రిల్ 6 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘మన ఊరు – మన జెండా’ కార్యక్రమం

ఏప్రిల్ 6 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘మన ఊరు – మన జెండా’ కార్యక్రమం

Published By: BharattodayTV Team
Published On
IND vs SA T20

ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టునుంది. పార్టీ ఆలోచనలను కేంద్ర ప్రభుత్వ పథకాలను ఇంటింటికీ పరిచయం చేసే లక్ష్యంతో కార్యక్రమాన్ని రూపొందించారు. సోమవారం విజయవాడ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి కార్యశాలలో పార్టీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్  పాల్గొని “మన ఊరు – మన జెండా” కార్యక్రమం పోస్టర్‌ను ఆవిష్కరించారు. జన సంఘ్, భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, ఏప్రిల్ 6 నుంచి మన ఊరు – మన జెండా అనే కార్యక్రమం ద్వారా పార్టీ ప్రస్థానాన్ని, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు, వాటి ఫలాలను గడపగడపకూ తీసుకెళ్లాలని నాయకులు, కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు.

Share to...