Home » Telangana » లిమ్స్ న్యూరో & కార్డియాక్ హాస్పిటల్ ప్రారంభం: పేదలకు నాణ్యమైన వైద్యం అందడమే లక్ష్యం

లిమ్స్ న్యూరో & కార్డియాక్ హాస్పిటల్ ప్రారంభం: పేదలకు నాణ్యమైన వైద్యం అందడమే లక్ష్యం

Published By: BharattodayTV Team
Published On
IND vs SA T20

రంగారెడ్డి జిల్లా గ్రేటర్ శంషాబాద్ జోన్ పరిధిలోని తొండుపల్లి వద్ద నూతనంగా నిర్మించిన లిమ్స్ (LIMS) న్యూరో & కార్డియాక్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఘనంగా ప్రారంభించారు. గురువారం జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేసి, రిబ్బన్ కట్ చేసిన అనంతరం ఆయన ఆసుపత్రిలోని అత్యాధునిక వైద్య సదుపాయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. లిమ్స్ హాస్పిటల్ బృందానికి అభినందనలు తెలిపారు. “వైద్య వృత్తికి కళంకం రాకుండా, కేవలం వ్యాపార దృక్పథంతో కాకుండా సేవా భావంతో ముందుకు సాగడం సంతోషకరం. సమాజ హితం కోసం డాక్టర్లు పని చేయాలి. రోగికి సమస్య వచ్చినప్పుడు దేవుడిలా భావించేది డాక్టర్‌నే, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి” అని ఆయన సూచించారు. కార్పొరేట్ ఆసుపత్రులు సామాన్యుల నుంచి భారీగా వసూలు చేస్తున్న తరుణంలో, లిమ్స్ యాజమాన్యం పేదలకు అండగా ఉండాలని కోరారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ.. సాధారణ నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన డాక్టర్ రామరాజు, నేడు ఆరు బ్రాంచీలతో ప్రజలకు సేవలు అందించడం అభినందనీయమన్నారు.

స్థానిక ప్రజలకు వరం..

లిమ్స్ ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రామరాజు మాట్లాడుతూ, గతంలో శంషాబాద్ ప్రాంతంలో న్యూరో మరియు కార్డియాక్ అత్యవసర పరిస్థితుల్లో హైదరాబాద్ వెళ్లేలోపు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయని, అలాంటివి పునరావృతం కాకూడదనే ఉద్దేశంతోనే ఈ బ్రాంచ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Share to...