Home » Nation » మరణంలోనూ మరొకరికి జీవనదాతగా.. హెడ్ కానిస్టేబుల్ లక్ష్మీరాజంకి అశ్రునివాలి

మరణంలోనూ మరొకరికి జీవనదాతగా.. హెడ్ కానిస్టేబుల్ లక్ష్మీరాజంకి అశ్రునివాలి

Published By: BharattodayTV Team
Published On
IND vs SA T20

మానవత్వానికి నిలువుటద్దం: పోలీస్ అంటే కేవలం రక్షణే కాదు, ప్రాణదాత కూడా!

విధి నిర్వహణలోనే కాదు.. మరణానంతరం కూడా మరొకరికి ప్రాణదాతగా నిలిచి పోలీస్ అంటే కేవలం రక్షణే కాదు, మానవత్వానికి నిలువుటద్దమని చాటిచెప్పారు మన పోలీస్ సోదరుడు నల్లాల లక్ష్మీరాజం అని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ కొనియాడారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పీఎస్ లో హెడ్ కానిస్టేబుల్‌గా సేవలందిస్తున్న ఆయన ఆకస్మిక మరణం అత్యంత బాధాకరం.పుట్టెడు శోకంలోనూ లక్ష్మీరాజం భార్య రాధ తీసుకున్న నిర్ణయం గర్వించదగ్గది. తన భర్త భౌతికంగా దూరమైనా, ఆయన అవయవాల ద్వారా మరొకరిలో జీవించాలని ఆమె తీసుకున్న అవయవ దాన నిర్ణయం అత్యున్నతమైనది. ఆయన రెండు కిడ్నీలను దానం చేయడం ద్వారా ఇద్దరు వ్యక్తులకు పునర్జన్మ లభించింది. మరణించినా మరో ప్రాణమై బతకడం కంటే గొప్ప సాఫల్యం ఏముంటుంది? అవయవ దానంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి. మనందరం ఒకరి ప్రాణాన్ని కాపాడే జీవదాతలుగా మారుదాం… అంటూ పిలుపునిచ్చారు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్. 

 

Share to...