Home » Latest » Ysrcp: వైసీపీలోకి రాజశేఖర్ రెడ్డి సన్నిహిత నేతలు!

Ysrcp: వైసీపీలోకి రాజశేఖర్ రెడ్డి సన్నిహిత నేతలు!

Published By: BharattodayTV Team
Published On
IND vs SA T20

ఏపీలో ( Andhra Pradesh)విచిత్ర రాజకీయ పరిణామాలు నడుస్తున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తోంది కూటమి. ఎలాగైనా నిర్వీర్యం చేయాలన్న ప్రయత్నంలో ఉంది. అయితే ఇది సహజంగానే వైయస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులకు మింగుడు పడని విషయం. వైసీపీలో లేని వారు సైతం ఈ విషయంలో ఆందోళనతో ఉన్నారు. వారు వేరే పార్టీలో ఉన్న జగన్ బలపడాలన్నది వారి అభిమతం. అయితే వివిధ కారణాలతో ఇన్ని రోజులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉన్న చాలామంది నేతలు ఇప్పుడు ఆ పార్టీలో చేరేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. గతంలో రకరకాల కారణాలతో వైసీపీలో చేరలేదు రాజశేఖర్ రెడ్డి సన్నిహితులు. అటువంటి వారికి ఇప్పుడు జగన్ ఆఫర్ ఇస్తున్నట్లు సమాచారం. పార్టీలోకి రావాలని ఒత్తిడి పెంచుతున్నట్లు తెలుస్తోంది.

 * రాష్ట్ర విభజనతో వైసీపీలోకి…

 2014 రాష్ట్ర విభజనతో కాంగ్రెస్( Congress) పార్టీకి చాలామంది దూరమయ్యారు. అందులో మెజారిటీ నేతలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కొద్దిమంది మాత్రమే తెలుగుదేశం పార్టీ వైపు వచ్చారు. అయితే మరికొందరు తటస్థంగా ఉండిపోయారు. అటువంటి వారిలో ఉండవల్లి అరుణ్ కుమార్, కెవిపి రామచంద్రరావు, పల్లం రాజు, కనుమూరి బాపిరాజు, జీవి హర్ష కుమార్, తులసి రెడ్డి, రఘువీరారెడ్డి లాంటి నేతలంతా వైసీపీలో చేరలేదు. అయితే ఇప్పుడు వీరందరినీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేర్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఇప్పటికే కొందరు వైసీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది.

 * బయటపెట్టిన అంబటి..

 ఇటీవల ఉండవల్లి అరుణ్ కుమార్ కు ( Vadavalli Arun Kumar)ఇంటర్వ్యూ చేశారు మాజీమంత్రి అంబటి రాంబాబు. ఆయన ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఉండవల్లి అరుణ్ కుమార్ ను ఇంటర్వ్యూ చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి జగన్మోహన్ రెడ్డికి అండగా నిలవాలని కూడా కోరారు. అయితే ఇదేదో మామూలుగా అడిగిన ప్రశ్న కాదు. తెర వెనుక కూడా ఇదే జరుగుతోందని తెలుస్తోంది. ఇప్పటికే జీవీ హర్ష కుమార్ వైసీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో ఆయన కుమారుడు జీవి స్వరాజ్ రాజమండ్రి ఎంపీ స్థానానికి పోటీ చేస్తారని కూడా ప్రచారం నడుస్తోంది.

 * అందరూ ఆయన సన్నిహితులే..

 అయితే వైయస్ రాజశేఖర్ రెడ్డి తో వీరంతా సన్నిహిత నేతలు. కెవిపి రామచంద్రరావు అయితే రాజశేఖర్ రెడ్డి కి ఆత్మగా అభివర్ణించేవారు. రాజశేఖర్ రెడ్డి తన పాదయాత్రలో ఉండవల్లి అరుణ్ కుమార్ ను గుర్తించి కాంగ్రెస్ పార్టీలో చేర్పించుకున్నారు. రెండుసార్లు ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపించుకున్నారు. జీవీ హర్ష కుమార్ పరిస్థితి కూడా అదే. ఆయన రెండుసార్లు అమలాపురం ఎంపీ అయ్యారు. మరోవైపు పల్లం రాజును సైతం ఎంపీని చేసిన ఘనత రాజశేఖర్ రెడ్డి. రఘువీరారెడ్డి రాజశేఖర్ రెడ్డి కి ఎంతో సన్నిహితుడు. వీరందరినీ వైసీపీలోకి రప్పించేందుకు సంబంధించిన గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ అవుతున్నట్లు సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి.

 

Share to...