Home » Latest » తపన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు

తపన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు

Published By: BharattodayTV Team
Published On
IND vs SA T20

 ఏలూరు:   ఏలూరు శ్రీరామ్ నగర్ లోని తపన ఫౌండేషన్ కార్యాలయంలో ” శ్రీ పరాభవ నామ సంవత్సర ” ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఫౌండేషన్ వ్యవస్థాపకుడు మరియు బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు గారపాటి సీతారామాంజనేయ చౌదరి దంపతులు పూజా కార్యక్రమం నిర్వహించారు. ఉగాది పండుగ అంటే కేవలం పండుగ మాత్రమే కాదు… కొత్త ఆశలకు మరియు ఆశయాలకు పునాది. షడ్రుచుల సమ్మేళనమైన ‘ ఉగాది పచ్చడి ‘ మన జీవితంలోని సుఖదుఃఖాలను సమానంగా స్వీకరించాలని మనందరికీ నేర్పుతుంది. ప్రకృతి కొత్త చిగుళ్లతో కళకళలాడుతున్నట్లే, మనందరి జీవితాలు కూడా కొత్త ఉత్సాహంతో నిండాలని సీతారామంజనేయ చౌదరి ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ రీజియన్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు , యాజ్ఞవల్క్యరాజాశ్రమాధిపతి శ్రీకృష్ణచరణానందభారతీ స్వామిజీ, బీజేపీ జిల్లా అధ్యక్షులు చౌటపల్లి విక్రమ్ కిషోర్ , స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Share to...