ఎన్టీఆర్ జిల్లా, మైలవరం దేవునిచెరువు తారకరామా నగర్ మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇటీవల మధ్యాహ్న భోజనం బాగాలేదంటూ పాఠశాల హెచ్ఎం డ్రామా ఆడించిన ఘటన నేపథ్యంలో మంత్రి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. విద్యార్థులకు వడ్డిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని తిని నాణ్యతను పరిశీలించారు. భోజనం ఎలా ఉందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. భోజనం బాగాలేకపోతే ముందు తల్లిదండ్రులకు చెప్పాలని సూచించారు. తప్పు పునరావృతం అయితే కఠిన చర్యలు తప్పవని బాధ్యులను హెచ్చరించారు.
School HM డ్రామాపై లోకేష్ సీరియస్: భోజనం నాణ్యతను స్వయంగా పరీక్షించిన మంత్రి.
Tags:
AndhraPradesh Mid-day meal quality MidDayMeals Mylavaram Mylavaram school surprise check Nara Lokesh school visit NaraLokesh
Related News



