సమాజంలో చాలా మంది చిన్న ఓటమి ఎదురు కాగానే కృంగి పోతుంటారు. కొందరు భయపడి వెనకడుగు వేస్తారు. అయితే ఓటమి అన్నది ముగింపు కాదన్న విషయం గ్రహించి ఓటమిని జయించి విజయం సాధించే మార్గాలు అన్వేషించాలి.
సానుకూల దృక్పథం, ఆత్మ విశ్వాసం, నైపుణ్యాలు స్వంతం చేసుకోవాలి.
ఓటమిని జయించే 5 శక్తివంతమైన మార్గాలను పరిశించి ప్రయత్నం ప్రారంభించండి
1. బాధను కాదు – బాటను చూడండి
ఓటమి తర్వాత మనసు భారంగా ఉంటుంది.
కానీ అదే సమయంలో మెదడు మరింత స్పష్టంగా పని చేస్తుంది.
అందుకే… కన్నీళ్లు తుడిచాక, కారణాలు విశ్లేషించండి.
2. తప్పును ఒప్పుకోండి – శిక్షను కాదు, శిక్షణను తీసుకోండి
జరిగిన తప్పును అంగీకరించడం బలహీనత కాదు,
అది మన బలాన్ని పెంచే మొదటి అడుగు.
3. చిన్న విజయాలను సృష్టించండి
ఒక్క పెద్ద విజయం కోసం ఎదురు చూడకండి,
రోజూ ఒక చిన్న విజయం సాధించండి.
అది అలవాటుగా మారితే… పెద్ద విజయం ఆటోమేటిక్ గా వస్తుంది.
4. పోలికలను పక్కన పెట్టండి
వేరే వాళ్లతో మీ ప్రయాణాన్ని పోల్చొద్దు.
ఎందుకంటే…
వాళ్ల హైలైట్ రీల్ మాత్రమే మీరు చూస్తున్నారు,
వాళ్ల హార్డ్ వర్క్ రీల్ కాదు.
5. మళ్ళీ ప్రయత్నించండి – కానీ ఈసారి కొత్తగా
అదే ప్రయత్నం, అదే ఆలోచనతో చేస్తే అదే ఫలితం వస్తుంది.
అందుకే ఓటమి తర్వాత ప్రయత్నం ఆపొద్దు,
ప్రయత్నం చేసే విధానాన్ని మార్చండి.
గుర్తుంచుకోండి:
ఓటమి మిమ్మల్ని పడగొడుతుంది,
కానీ మీ సంకల్పమే మిమ్మల్ని లేపగలదు.
ఇనుము కూడా అగ్నిలో కాలాకే ఉక్కుగా మారుతుంది,
మనిషి కూడా కష్టాల్లో ఓడాకే
బలమైన వ్యక్తిత్వంగా మారతాడు.
కాబట్టి…
ఓటమికి భయపడొద్దు.
ఓటమి ఇచ్చే పాఠానికి గౌరవం ఇవ్వండి.
ఎందుకంటే…
ఓడటం ఒక అనుభవం,
దాన్ని జయించడం ఒక అర్హత.
మీరు కూడా ఓటమిని విజయానికి మెట్టుగా మార్చిన అనుభవం ఉంటే కామెంట్ లో పంచుకోండి.
– డా. ఎన్.బి. సుధాకర్ రెడ్డి (వ్యక్తిత్వ వికాస శిక్షకుడు)



