Home » Latest » Tgbjp : బిజెపిలో ఏం జరుగుతోంది? హై కమాండ్ ఆరా!

Tgbjp : బిజెపిలో ఏం జరుగుతోంది? హై కమాండ్ ఆరా!

Published By: BharattodayTV Team
Published On
IND vs SA T20

తెలంగాణ( Telangana) బిజెపిలో ఏం జరుగుతోంది? ఎదిగినట్టే ఎదిగి ఇప్పుడు ఈ ఫలితాలు ఏంటి? మొన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు.. ఇప్పుడు స్థానిక సంస్థల ఫలితాలు దేనికి సంకేతం? సార్వత్రిక ఎన్నికల్లో వచ్చిన ఫలితాన్ని నిలబెట్టుకోలేదు ఎందుకు? నేతల మధ్య సమన్వయ లోపమా? లేకుంటే వ్యూహం దెబ్బతిందా? తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది.

బిజెపి పార్టీ ఇలా పడిపోయింది అన్న చర్చ తెలంగాణ వ్యాప్తంగా విస్తరిస్తోంది. ఇద్దరు కేంద్ర మంత్రులు, 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు ఉన్న పార్టీకి ఏంటి పరిస్థితి అనేది హాట్ టాపిక్.

 * ఎంపీలపై ప్రధాని ఆగ్రహం..

 రెండు రోజుల కిందట ప్రధాని నరేంద్ర మోడీని( Prime Minister Narendra Modi) కలిశారు తెలంగాణ ఎంపీలు. తెలంగాణ బిజెపిలో ఏం జరుగుతోంది? ఎందుకు మనం నానాటికి దిగజారుతున్నాం అని ప్రధాని నరేంద్ర మోడీ అడిగేసరికి బిజెపి ఎంపీల వద్ద సమాధానం లేకుండా పోయింది. అయితే ఒకటి మాత్రం నిజం. ఒకరిద్దరు నాయకుల మధ్య బందీ అయిన అధికారం, ఆధిపత్యం కారణంగానే తెలంగాణలో బిజెపి నానాటికి తీసి కట్టుగా మారుతుంది. ఎవరికి వారు పెద్దలుగా మారి పార్టీ లైన్ ను విస్మరించిన ఫలితంగానే ప్రజలకు చేరువ కావాల్సిన పార్టీ జారుడు బండి ప్రయోగాలు చేస్తోంది. దాని పర్యవసానాలే ఈ ఫలితం.

* సంస్కరణలకు ఇదే సమయం..

 తెలంగాణ బిజెపిని సంస్కరించాల్సిన అవసరం ఉంది. ఇదే విషయాన్ని ఆరు నెలల కిందట ఘోషమహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్( MLA Raja Singh) తేల్చి చెప్పారు. అయితే ఆయన మాటలను ఎవరూ పట్టించుకోలేదు. ఆయన బయటకు వెళ్లిపోయారా చేశారన్న వాదన కూడా ఉంది. అయితే ఇప్పుడు అదే వాదనను తెరపైకి తెచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ. దీంతో తెలంగాణ విషయంలో సీరియస్ గానే ఆలోచన చేస్తున్నారు మోడీ. వచ్చే ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకోవచ్చు అనేది బీజేపీ వాదన. కానీ ఈ తడబాటు చూస్తుంటే ఉన్న బలం కూడా పోయేలా ఉంది. ముఖ్యంగా బండి సంజయ్ పార్టీ చీఫ్ గా ఉన్నప్పుడు ఉన్న వేగం, రాజకీయ దూకుడు ఇప్పుడు కనిపించడం లేదు. పైగా నేతల మధ్య సమన్వయం లేదు. ఒకరంటే ఒకరికి పడదు. ఒకరి నిర్ణయాలను మరొకరు అనుసరించే పరిస్థితి కూడా పార్టీలో లేదు. అసలు బిజెపి రాష్ట్ర చీఫ్ కిషన్ రెడ్డితో కొందరికి పడదన్న విమర్శలు ఉన్నాయి. ఈటెల రాజేందర్, బండి సంజయ్, మాధవి లత, కిషన్ రెడ్డి వంటి కొద్ది మంది మాత్రమే బిజెపిలో ఆక్టివ్ గా ఉన్నారు. మిగతావారు ఎందుకో సైలెంట్ అవుతున్నారు.

* కమిటీల ఏర్పాటులో జాప్యం

 ఒక జాతీయ పార్టీగా ఉన్న బిజెపిని గ్రామస్థాయికి విస్తరించే ప్రయత్నం జరగలేదు. దాని పర్యవసానాలే పంచాయితీ ఎన్నికల్లో వెనుకబాటు. క్షేత్రస్థాయి కమిటీల ఏర్పాటు, నాయకులను సమన్వయం చేయడంలో విఫలం కావడం పార్టీకి నష్టం చేకూరుస్తోంది. దీనివల్లే పార్టీ దెబ్బతింటుందన్న వాదన వినిపిస్తోంది. కనీసం తెలంగాణ బిజెపిలో ఏం జరుగుతోంది అనేది హై కమాండ్ ఇన్ని రోజులు పట్టించుకోలేదు. కానీ తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలు చూస్తే మాత్రం.. కచ్చితంగా హై కమాండ్ తెలంగాణ బిజెపిపై ఫుల్ ఫోకస్ పెట్టే అవకాశం ఉంది.

 

Share to...