Home » Andhra Pradesh » Ysjagan : ఉగాది వేడుకల్లో జగన్ దంపతులు

Ysjagan : ఉగాది వేడుకల్లో జగన్ దంపతులు

Published By: BharattodayTV Team
Published On
IND vs SA T20

విజయవాడలో వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు జరిగాయి. ఉగాది వేడుకలకు మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్,  వైయస్‌ భారతి దంపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పంచాంగ శ్రవణం జరిగింది. శాస్త్రోక్తంగా పూజ తర్వాత పంచాంగ శ్రవణం వినిపించిన పిడపర్తి భాస్కర సుబ్రమణ్యశాస్త్రి.  పంచాంగ శ్రవణం అనంతరం  వైయస్‌ జగన్‌ దంపతులకు వేద ఆశీర్వచనం ఇచ్చి, తీర్ధప్రసాదాలు అందించిన వేదపండితులు. సాంప్రదాయ పంచెకట్టు, భుజాన కండువాలో వేడుకలకు హాజరైన  వైయస్‌ జగన్‌. ఉగాది వేడుకల కోసం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక వేదిక ఏర్పాటు. పూజా మందిరంలా వేదిక. శాస్త్రోక్తంగా పూజ తర్వాత పంచాంగ శ్రవణం వినిపించిన పిడపర్తి భాస్కర సుబ్రమణ్యశాస్త్రి. పంచాంగ శ్రవణం అనంతరం  వైయస్‌ జగన్‌ దంపతులకు వేద ఆశీర్వచనం ఇచ్చి, తీర్ధప్రసాదాలు అందించిన వేదపండితులు.రెండు తెలుగు రాష్ట్రాలలో ఉగాది పర్వదినాన్ని ఘనంగా జరుపుకుంటున్న అందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.

Share to...