Home » Andhra Pradesh » YSSharmila: కాంగ్రెస్ పగ్గాలు కాపులకు ..షర్మిల అవుట్ !

YSSharmila: కాంగ్రెస్ పగ్గాలు కాపులకు ..షర్మిల అవుట్ !

Published By: BharattodayTV Team
Published On
IND vs SA T20

ఏపీలో( Andhra Pradesh) కాంగ్రెస్ పగ్గాలు మారబోతున్నాయా? వైయస్ షర్మిల ను మార్చబోతున్నారా? కొత్త వ్యక్తిని తెరపైకి తేనున్నారా? పొలిటికల్ వర్గాల్లో గత కొద్ది రోజులుగా ఇదే చర్చ నడుస్తోంది. 2024 ఎన్నికల కు ముందు కాంగ్రెస్ పగ్గాలు అందుకున్నారు షర్మిల. ఆమెతో పార్టీకి పూర్వవైభవం వస్తుందని ఆశించింది హై కమాండ్. కానీ ఉన్న నేతలను సైతం కాపాడుకోలేకపోయారు షర్మిల. ఆమె సొంత వ్యక్తిగత అజెండాతో పని చేస్తున్నారన్న విమర్శ ఉంది. కేవలం జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీయాలన్న పంతం ఆమెది. 2024 ఎన్నికల్లో అనంత పని చేశారు. జగన్ ఓటమికి కారణమయ్యారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలకు ఎటువంటి ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు అదే మైనస్ గా మారింది ఆమెకు.

గత కొంతకాలంగా షర్మిల( Y S Sharmila ) మార్పు ఉంటుందన్న ప్రచారం జరిగింది. దానికి కారణం లేకపోలేదు. ఆమెపై చాలామంది సీనియర్లు హై కమాండ్ కు ఫిర్యాదు చేశారు. అయితే సరైన నేత కాంగ్రెస్ పార్టీకి చిక్కలేదు. అందుకే షర్మిల మార్పు కాలేదు. అయితే ఇప్పుడు సరైన కాపు నేత కాంగ్రెస్ పార్టీకి చిక్కినట్లు తెలుస్తోంది.

పిసిసి పగ్గాలు కాపు సామాజిక వర్గానికి ఇస్తే కొంత టర్న్ అయ్యే అవకాశం ఉంది. అది కూడా ఊపు తెచ్చే నాయకుడు ఇప్పుడు అవసరం. అలా పార్టీ హై కమాండ్ ఆలోచనతో ఓ మాజీ ఎంపీ రంగంలోకి దిగారు. (Vangaveeti ranga) వంగవీటి మోహన్ రంగా వారసుడు రాధాకృష్ణతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలోకి వస్తే రాష్ట్ర బాధ్యతలు అప్పగిస్తామని ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. దీనిపై రాధాకృష్ణ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.

* రంగ వారసులపై అధిష్టానం దృష్టి

వంగవీటి రాధాకృష్ణకు( vangaveeti Radha Krishna ) పార్టీ పగ్గాలు అప్పగిస్తే కాంగ్రెస్ పార్టీ కొంతవరకు బలోపేతం అవుతుందన్న టాక్ ఉంది. ఎందుకంటే వంగవీటి కుటుంబం అంటే కాపుల్లో ఒక రకమైన అభిమానం ఉంది. రాధాకృష్ణ లాంటి నేతకు అవకాశం ఇస్తే.. కూటమి పార్టీలోకి వెళ్లలేని చాలామంది కాపు నేతలు కాంగ్రెస్ వైపు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం రాధాకృష్ణతో పాటు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కాపు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ప్రచారం నడుస్తోంది.

వంగవీటి మోహన్ రంగా( Mohan Ranga) కాంగ్రెస్ పార్టీలోనే ఉండేవారు. ఆ పార్టీ తరఫున 1985లో అసెంబ్లీకి పోటీ చేసి గెలిచారు. కాపు సేనతో భారీ ఉద్యమం దిశగా అడుగులు వేశారు వంగవీటి మోహన్ రంగ. ఈ క్రమంలోనే 1988లో దారుణ హత్యకు గురయ్యారు. అటు తరువాత ఆ కుటుంబం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగింది. వంగవీటి రాధాకృష్ణ సైతం కాంగ్రెస్ పార్టీ తరఫున 2004లో పోటీ చేసి అసెంబ్లీలో అడుగు పెట్టారు. కానీ తర్వాత.. ఆ తరువాత వైయస్సార్ కాంగ్రెస్.. అటు తరువాత ఇప్పుడు టిడిపిలో కొనసాగుతున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో కానీ.. ప్రభుత్వ కార్యక్రమాల్లో కానీ ఎక్కడా కనిపించడం లేదు రాధా.

కూటమి అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతోంది. రాధాకృష్ణకు ఎటువంటి పదవులు దక్కలేదు. అయితే అందులో ఆయన అసంతృప్తితో ఉన్నారని ప్రచారం నడుస్తోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే విజయవాడకు చెందిన మాజీ ఎంపీ రాధా తో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలోకి వస్తే స్వేచ్ఛగా పనిచేసుకోవచ్చని.. పార్టీ పగ్గాలు ఇస్తామని ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలో ఆయన చేరిక ఉంటుందని ప్రచారం జరుగుతోంది. మరి అందులో ఎంతవరకు వాస్తవం ఉందో చూడాలి.

Share to...