భారతీయజనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు PVN మాధవ్ మరియు బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రొంగల గోపికృష్ణ ఆదేశాల మేరకు బిజెపి ఎన్టీఆర్ జిల్లా OBC మోర్చా అధ్యక్షులు కందుల సుబ్రహ్మణ్యేశ్వర రావు ఆధ్వర్యంలో *శ్రీ సంత్ గాడ్గే బాబా* 150 వ జయంతిని ఘనంగా నిర్వహించారు . సోమవారం ఉదయం 8 గంటలకు కృష్ణలంక దోబిఘాట్ విజయవాడ నందు భారతీయజనతాపార్టీ నాయకులు సంత్ గాడ్గే బాబాగారి చిత్రపటానికి పూల మాలలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించి ,దోబిఘాట్ నందు స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించి ,తదనంతరం దోబిఘాట్ లో సంవత్సరాల తరబడి పనిచేస్తున్న రజక కార్మికులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బిజెపి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ 20 వ శతాబ్దపు సంఘ సంస్కరణ ఉద్యమానికి సహకరించిన గొప్ప వ్యక్తులలో బాబా గాడ్గే ఒకరని. కానీ చరిత్రకారులు ఆ మహనీయుడికి తగిన ప్రాధాన్యత ఇవ్వ లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయవాడ డెంటల్ క్లినిక్ అధినేత డాక్టర్ కే శ్రీనివాస్ బాబు, ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు శివకుమార్ పట్నాయక్, మరియు ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చోరగుడి శివ లలిత, ఓబీసీ మోర్చా ఎన్టీఆర్ జిల్లా ఇంచార్జ్ కేతనబోయిన హనుమంతరావు ,NTR జిల్లా BJP ప్రధాన కార్యదర్శి కోలపల్లి గణేష్ ,బిజెపి కృష్ణలంక మండల అధ్యక్షులు దుర్గాప్రసాద్ సీనియర్ నాయకులు లాకా వెంగళరావు యాదవ్,వాసపల్లపురాజు తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీ సంత్ గాడ్గే బాబా జయంతి వేడుకలు
Tags:
#BJP 150thBirthAnniversary AndhraPradeshPolitics NTRDistrict OBCMorcha RajakaCommunity SantGadgeBaba SocialReformer SwachhBharat Vijayawada
Related News



