Home » Andhra Pradesh » సైకత శిల్పంతో సామాజిక చైతన్యం…రంగంపేట ‘దేవిన సిస్టర్స్’కు విశిష్ట పురస్కారం అందజేసిన సీఎం చంద్రబాబు

సైకత శిల్పంతో సామాజిక చైతన్యం…రంగంపేట ‘దేవిన సిస్టర్స్’కు విశిష్ట పురస్కారం అందజేసిన సీఎం చంద్రబాబు

Published By: BharattodayTV Team
Published On
IND vs SA T20

బాలికలకు పురస్కారం అందజేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు

విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఘనంగా ఉగాది వేడుకలు నిర్వహించింది. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో సేవలు అందించిన కళాకారులు, పాత్రికేయులకు ప్రభుత్వం ఉగాది పురస్కారాలు అందజేసి సత్కరించింది. సైకత శిల్ప కళ ద్వారా ప్రజలను చైతన్యవంతం చేస్తున్న తూర్పుగోదావరి జిల్లా రంగంపేటకు చెందిన దేవిన సిస్టర్స్ సోహిత, ధన్యత “ఆంధ్రప్రదేశ్ విశిష్ట ఉగాది పురస్కారం” ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అందుకున్నారు. చిన్న వయసులో సామాజిక చైతన్యానికి కృషి చేస్తున్న బాలికలను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించారు. 

 

 

Share to...