అమరావతి: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా అన్ని భారతీయ జనతా పార్టీ కార్యాలయాల్లో ఉగాది వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పి.వి.ఎన్. మాధవ్ పిలుపునిచ్చారు. బుధవారం ఆడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
పంచాంగ శ్రవణం: రాష్ట్రంలోని జిల్లా పార్టీ కార్యాలయాల్లో పురోహితులను పిలిపించి పూజా కార్యక్రమాలతో పాటు పంచాంగ శ్రవణాన్ని తప్పనిసరిగా నిర్వహించాలి.
గ్రామ దేవతల దర్శనం: ప్రతి జిల్లాలోని ముఖ్యమైన గ్రామ దేవతలను పార్టీ నాయకులు సందర్శించాలని మాధవ్ సూచించారు.
*సారె సమర్పణ*: గ్రామ దేవతలకు పార్టీ తరపున సంప్రదాయబద్ధంగా *సారె* సమర్పించే కార్యక్రమాన్ని చేపట్టాలి. క్షేత్ర స్థాయిలో బిజెపి నాయకులు గ్రామ దేవతలను సందర్శించే కార్యక్రమం ప్రణాళిక బద్ధంగా నిర్వహించాలని, అలాగే డప్పు వాయిద్యాలు తో ఊరేగింపు స్థానిక ప్రజలతో కలిసి చేయాలన మాధవ్ ఆదేశించారు.



