మరిచిపోయిన బంగారు నగలు, నగదును తిరిగి అప్పగించి.. నిజాయితీని చాటుకున్న ఆటో డ్రైవర్ వేణు👏”
పిఠాపురం నుండి సామర్లకోట వరకు ప్రయాణించిన ఇద్దరు ప్రయాణికులు, తమ బ్యాగును ఆటో డిక్కీలో మర్చిపోయి దిగిపోయారు. ఆ బ్యాగులో వెలకట్టలేని నల్లపూసల దండ, నెక్లెస్ మరియు నగదు ఉన్నాయి. తమ సర్వస్వం పోయిందని ఆ ప్రయాణికులు కన్నీటి పర్యంతమవుతున్న వేళ.. ఆటో డ్రైవర్ వేణు రూపంలో మానవత్వం మెరిసింది.తిరుగు ప్రయాణంలో బ్యాగును గమనించిన వేణు, ఏమాత్రం తడుముకోకుండా వెంటనే సామర్లకోట శ్రీ సాయి గణపతి ఆటో యూనియన్ స్టాండ్‌కు చేరుకుని, ఆ ప్రయాణికులకు వారి సొత్తును భద్రంగా అప్పగించారు.



