Home » Andhra Pradesh » Duvvada: వైసిపికి తలనొప్పిగా ఎమ్మెల్సీ దువ్వాడ !

Duvvada: వైసిపికి తలనొప్పిగా ఎమ్మెల్సీ దువ్వాడ !

Published By: BharattodayTV Team
Published On
IND vs SA T20

వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీకి తలనొప్పిగా మారారు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. వ్యక్తిగత, కుటుంబ వ్యవహారాలతో పార్టీకి డ్యామేజ్ చేస్తున్నారని కొద్దిరోజుల కిందట ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హై కమాండ్. అయితే దీని వెనుక ధర్మాన బ్రదర్స్ ఉన్నారన్నది దువ్వాడ శ్రీనివాస్ ఆరోపణ. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కింజరాపు ఫ్యామిలీతో కలిసి తనను తొక్కే ప్రయత్నం ఎప్పటినుంచో జరుగుతోందని ఆరోపిస్తున్నారు. అందులో భాగంగానే తన సస్పెన్షన్ వేటు అని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అయితే ఇటీవల ఆయన వాయిస్ పెంచారు. మాజీ మంత్రి ధర్మాన కృష్ణ దాస్ ను టార్గెట్ చేసుకుని మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో దువ్వాడ శ్రీనివాస్ పై దాడి జరగబోతోందని ఓవైసీపీ చోటా నేత దివ్వెల మాధురితో ఫోన్లో చేసిన సంభాషణ లీక్ అయింది. ఇటువంటి పరిస్థితుల్లో దువ్వాడ శ్రీనివాస్ నిమ్మాడ జంక్షన్లో హల్ చల్ చేశారు. అది కింజరాపు ఫ్యామిలీ స్వగ్రామం కావడం గమనార్హం.

 ప్రస్తుతం తన సహచరి దివ్వెల మాధురితో కలిసి వస్త్ర వ్యాపారంలో అడుగుపెట్టారు దువ్వాడ శ్రీనివాస్( Duvvada Srinivas) . సోషల్ మీడియాలో సైతం చాలా యాక్టివ్ గా ఉన్నారు. అప్పుడప్పుడు స్వగ్రామం టెక్కలి వచ్చి రాజకీయ విమర్శలు చేస్తూ వస్తుంటారు. అయితే ఇప్పటికీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో పాటు జగన్మోహన్ రెడ్డిని ఎంతో గౌరవభావంతో చూస్తూ వస్తున్నారు దువ్వాడ శ్రీనివాస్. తిరిగి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతానన్న నమ్మకంతో ఆయన ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి తనను చేరదీస్తారని కూడా ఆశతో ఉన్నారు. అయితే శ్రీకాకుళం జిల్లాలో సొంత పార్టీలో తన ఎదుగుదలను ఓర్వలేక పోతున్నారని ధర్మాన బ్రదర్స్ పై దువ్వాడ శ్రీనివాస్ సంచలన ఆరోపణలు చేస్తూ వచ్చారు. తనకు రాజకీయ ప్రత్యర్థి అయిన కింజరాపు కుటుంబంతో కలిసి కుట్రలు చేస్తున్నారని ఎప్పటినుంచో ఆరోపిస్తూ వస్తున్నారు దువ్వాడ శ్రీనివాస్.

 ఇటీవల మాజీ మంత్రి ధర్మాన కృష్ణ దాస్ ( dharmana Krishna Das )జిల్లా అధ్యక్షుడి హోదాలో నియోజకవర్గాల సమావేశాలకు హాజరవుతున్నారు. ఈ క్రమంలో కొద్ది రోజుల కిందట ఇచ్చాపురంలో మాట్లాడారు. నియోజకవర్గంలో అందరూ సమన్వయకర్తలేనని వ్యాఖ్యానించేసరికి కాళింగ సామాజిక వర్గానికి చెందిన పిరియా సాయిరాజ్ వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. అదే సమయంలో దువ్వాడ శ్రీనివాస్ ఎంట్రీ ఇచ్చి కృష్ణ దాస్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు.

 ఇటీవల టెక్కలి వైసిపి సమన్వయ సమావేశానికి హాజరయ్యారు కృష్ణ దాస్. త్వరలో శ్రీకాకుళం పార్లమెంట్ స్థానానికి గట్టి అభ్యర్థిని జగన్మోహన్ రెడ్డి ప్రకటిస్తారని చెప్పుకొచ్చారు. ఇప్పటికే పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న తమ్మినేని సీతారాం కు ప్రత్యామ్నాయ పదవి ఇస్తారని చెప్పుకొచ్చారు. అయితే కాలింగ్ సామాజిక వర్గానికి చెందిన తమ్మినేని విషయంలో అలా ఎందుకు ప్రకటించారు అంటూ కృష్ణ దాస్ ను ప్రశ్నించారు దువ్వాడ శ్రీనివాస్. అది మొదలు రచ్చ ప్రారంభమైంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కాళింగ సామాజిక వర్గం దువ్వాడ శ్రీనివాస్ పై స్ట్రాంగ్ గా రియాక్ట్ అయింది. అదే సమయంలో దువ్వాడపై దాడికి ధర్మాన కుటుంబం ప్లాన్ చేస్తోందన్న అనుమానాలు బయటకు వచ్చాయి. దువ్వాడ శ్రీనివాస్ కు విధేయత గా ఉండే ఓ చోటా నేత దివ్వెల మాధురితో ఇదే విషయంపై మాట్లాడుతుండగా ఆడియో లీక్ అయ్యింది. అయితే దువ్వాడ శ్రీనివాస్ సైతం నిమ్మాడ జంక్షన్ వద్దకు వచ్చి హల్చల్ చేశారు. రండి తన పై దాడి చేయండి అంటూ సవాల్ చేశారు.

 దువ్వాడ శ్రీనివాస్ విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఏమీ పాలు పోవడం లేదు. ఇప్పటివరకు ఆయన పై సస్పెన్షన్ వేటు మాత్రమే ఉంది. ఇంతవరకు పార్టీ నుంచి బహిష్కరించలేదు. మళ్లీ పార్టీలోకి వస్తానన్న ధీమాతో ఆయన ఉన్నారు. కానీ జిల్లా నాయకత్వాన్ని గౌరవించడం లేదు. అందరితో నువ్వు గొడవ పడుతూ వివాదాలకు అవకాశం కల్పిస్తున్నారు. అయితే ఎంత మాత్రం దీనిపై ఉపేక్షించేది లేదని.. తక్షణం దువ్వాడ శ్రీనివాసులు పార్టీ నుంచి బహిష్కరించాలని ధర్మాన ఫ్యామిలీ కోరుతోంది. జగన్మోహన్ రెడ్డి పై ఒత్తిడి పెంచుతున్నట్లు కూడా తెలుస్తోంది. మరి చూడాలి ఏం జరుగుతుందో..

Share to...