ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు క్యూ కాంప్లెక్స్ గుండా శ్రీవారి దర్శనానికి వెళ్లడం అందరినీ ఆశ్చర్యపరిచింది. సీఎం హోదాలో ఉన్నవారికి తిరుమలలో మహాద్వార దర్శనం చేసుకునే అవకాశం ఉన్నా, దేవుని ముందు అందరూ సమానమే అనే సూత్రాన్ని సీఎం చంద్రబాబు పాటిస్తారు. అందుకే చంద్రబాబు తిరుమల కొండకు ఎప్పుడు వచ్చినా క్యూ కాంప్లెక్స్ ద్వారానే శ్రీవారి దర్శనం చేసుకుంటారు. చంద్రబాబు తొలిసారి సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇదే విధానాన్ని పాటిస్తున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పించే సమయంలో తప్పించి, మిగిలిన సందర్భాల్లో క్యూ కాంప్లెక్స్ ద్వారానే కుటుంబంతో సహా వెళ్లి శ్రీవారిని దర్శించుకుంటారు.
CBN: తిరుమలలో చంద్రబాబునాయుడు చేసిన పని తెలిస్తే ఆశ్చర్యపోతారు!



