Home » Andhra Pradesh » Apbjp: ఏపీ బీజేపీలో వైసిపి కోవర్డులు?! 

Apbjp: ఏపీ బీజేపీలో వైసిపి కోవర్డులు?! 

Published By: BharattodayTV Team
Published On
IND vs SA T20

ఏపీ బీజేపీలో( Bhartiya Janata Party) కోవర్టులు ఉన్నారా? పరోక్షంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సహకారమందిస్తున్నారా? కూటమి సమాచారాన్ని ఎప్పటికప్పుడు వారికి చేరవేస్తున్నారా? పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. ఇటీవల బిజెపి ఏపీ ఎంపీలను పిలిచి ప్రధాని పలు సూచనలు చేసిన సంగతి తెలిసిందే. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని అనుకూల స్థాయిలో ఎందుకు కౌంటర్ ఇవ్వలేకపోతున్నారని సాక్షాత్ ప్రధాని ప్రశ్నించినట్లు ప్రచారం నడుస్తోంది. ఇటువంటి తరుణంలో బిజెపిలో వైసీపీ శ్రేయోభిలాషులు ఉన్నట్లు కొత్తగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

 

 తెలుగుదేశం ( Telugu Desam) పార్టీతో పొత్తు పెట్టుకుంది భారతీయ జనతా పార్టీ. ఆ రెండు పార్టీలను కలిపిన ఘనత మాత్రం పవన్ కళ్యాణ్ ది. 2018లో ఎన్డీఏ నుంచి బయటకు వెళ్ళిపోయింది తెలుగుదేశం. అది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎంతో లాభం చేకూర్చింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ట్రాప్ లో పడిన చంద్రబాబు ఎన్డీఏ కు దూరమయ్యారు. బిజెపి అగ్ర నేతలకు వ్యతిరేకంగా ప్రచారం చేసి వారికి వ్యతిరేకులుగా మారిపోయారు. ఇది అంతిమంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూర్చింది. పరోక్ష స్నేహంతో ఐదేళ్లపాటు జగన్మోహన్ రెడ్డి కేంద్ర పెద్దలతో సన్నిహితంగా గడుపుతూ వచ్చారు.

 

 2024 ఎన్నికల్లో టిడిపి, బిజెపి కలిసాయి. అయితే అప్పట్లో బీజేపీ నేతలు చాలామంది తెలుగుదేశం పార్టీతో పొత్తుకు ఒప్పుకోలేదు. చివరి నిమిషం వరకు అడ్డగించే ప్రయత్నం చేశారు. అయితే అది వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీకి ప్రయోజనం చేకూర్చేందుకేనని అప్పట్లో ప్రచారం సాగింది. కానీ పవన్ కళ్యాణ్ చొరవతో బిజెపి టిడిపిని కలుపు కెళ్ళింది. అయితే ఇంకా పాత వాసనలు చాలామంది బిజెపి నేతల్లో పోలేదని తెలుస్తోంది. ఇప్పటికీ వారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లైన్లో పనిచేస్తున్నారు అన్నది ప్రధాన ఆరోపణ.

 చాలామంది బిజెపి నేతలకు తెలుగుదేశం పార్టీ అంటే పడదు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఒకరు నిత్యం తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడేవారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు అంటే నో నెవర్ అని తేల్చి చెప్పేవారు. అయితే ఆయన ఉన్నంతవరకు పొత్తు కుదరదని భావించి.. ఆ తరువాత అధ్యక్షురాలుగా నియమితులైన పురందేశ్వరి ద్వారా చంద్రబాబు బిజెపికి దగ్గర కాగలిగారు. అయితే అటువంటి నేతలు చాలామంది తెలుగుదేశం పార్టీకి గిట్టరు. వారంతా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మనుషులన్న ప్రచారం ఎప్పటినుంచో ఉంది.

బంధం బలపడుతున్న సమయంలో

 మూడు పార్టీల మధ్య బంధం మరింత బలపడుతోంది. ఇప్పటికే కూటమి 18 నెలల పాలన పూర్తి చేసుకుంది. 2029 ఎన్నికల్లో సైతం మూడు పార్టీలు కలిసే వెళ్తాయని నాయకత్వాలు స్పష్టతనిస్తున్నాయి. అయితే ఈ మూడు పార్టీలు విడిపోవాలన్నది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమతం. కానీ వాటి మధ్య బంధం రోజురోజుకు స్ట్రాంగ్ అవుతుండడంతో.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కొత్త ఆలోచనకు తెరతీసినట్లు సమాచారం.

జగన్  టచ్లో ఉన్న  నేతలు ఎవరు 

ప్రధానంగా బిజెపిలో ఉంటూ చాలామంది వైసీపీకి సహకరిస్తున్నారు అన్నది ప్రధాన ఆరోపణ. ఈ జాబితాలో చాలామంది పేర్లు ఉన్నాయి. ప్రధానంగా ఓ సామాజిక వర్గం నేతలు అయితే ఎప్పటికప్పుడు కూటమి సమాచారాన్ని చేరవేస్తున్నారని ప్రచారంలో ఉంది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ సొంత పార్టీ ఎంపీలను హెచ్చరించడంతో ఈ ప్రచారం మరింత ఊపందుకుంది. మరి ఇందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.

Share to...