అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సుమారు మూడు దశాబ్దాల పాటు మార్గదర్శనం చేసిన పూర్తిసమయ కార్యకర్త శ్రీ జనమంచి గౌరీశంకర్.1980 దశకంలో పాలకుల నిర్లక్ష్యపు విధానాలవలన విద్యాలయాలు సమస్యల వలయాల్లో కొట్టుమిట్టాడుతూ విద్యావ్యవస్థ పూర్తిగా కుంటుపడుతున్న సమయాన రాష్ట్రవ్యాప్తంగా నిరంతరం పర్యటిస్తూ విద్యార్థిలోకాన్ని జాగృతపరిచి సమస్యల సాధనకై బాధ్యతాయుతమైన పోరాటాన్ని సాగించాలనే సంకల్పాన్ని విద్యార్థులలో కలిగించి ముందుకు నడిపించారు. విశ్వవిద్యాలయాలలో బలమైన విద్యార్థి ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న ఎబివిపి కార్యకర్తలను కరడుగట్టిన దేశభక్తులుగా తీర్చిదిద్ది క్రమశిక్షనాయుతమైన విద్యార్థిపరిషత్ నిర్మాణం గౌరీ శంకర్ చేతులమీదుగా జరిగింది. అనేక సామాజిక రుగ్మతలను రూపుమాపే కార్యక్రమాల రూపకల్పన చేసి విద్యార్థులను ఆ దిశగా నడిపించారు. సంస్థాగత అభ్యాసవర్గల నిర్వహణతో కార్యకర్తల తీర్చిదిదద్దడం, పేద విద్యార్థులకు ఉచిత బోధనా తరగతులు, రక్తదాన శిబిరాలు, శ్రమానుభవ శిబిరాలు, నేత్ర చికిత్సా శిబిరాలు, గంజి కేంద్రాల ఏర్పాటు తదితర సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించడం వలన విద్యార్థులను సామాజిక కార్యకర్తలుగా రూపుదిద్దడంలో గౌరీ శంకర్ ప్రధాన భూమిక పోషించారు.
ABVP రాష్ట్ర మహాసభలు
అఖిల భారతీయ విద్యార్థిపరిషత్ (ఎబివిపి) – తెలంగాణ 44వ రాష్ట్ర మహాసభలు శంషాబాద్లో జనవరి 3,4,5 తేదీలలో జరుగుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని, అవిభాజ్య ఆంధ్రప్రదేశ్లో ఎబివిపి విస్తృతికి విశేష కృషి చేసి, సమాజ సేవకే తన జీవితాన్ని సంపూర్ణంగా అంకితం చేసిన శ్రీ జనమంచి గౌరీశంకర్ (గౌరీజీ) పేరు మీద ప్రతి సంవత్సరం అందజేసే “శ్రీ జనమంచి గౌరీ శంకర్ యువపురస్కార్” దరఖాస్తులు ఆహ్వానించారు.
సమాజంపై సానుకూల ప్రభావం చూపే సేవా కార్యక్రమాలు, నూతన ఆవిష్కరణలు, ఇతర ప్రముఖ రంగాలలో విశేష కృషి సల్పుతూ, యువతీ యువకులకు స్ఫూర్తిగా నిలిచే జాతీయ భావాలు కలిగిన 40 సంవత్సరాల లోపు వయసు కలిగిన ఆదర్శ యువతీ, యువకులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ అవార్డు కింద 50,000 రూపాయల నగదు పురస్కారం, ప్రశంసా పత్రం అందజేయబడతాయి. దరఖాస్తుదారులు తమ పూర్తి బయోడేటా, చేస్తున్న కార్యక్రమాల వివరాలు పంపవలసి ఉంటుంది.
దరఖాస్తులను పంపుటకు చివరి తేది : December 25
ఈ-మెయిల్ అడ్రస్ : sosabvptg@gmail.com
సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు:- 9440981137 , 9666149044



