తెలంగాణ ప్రజలకు నాణ్యమైన ఆత్యాధునిక వైద్య సదుపాయాలను అందించే లక్ష్యంతో.. కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న AIIMS బీబీనగర్ వైద్య విద్య, పరిశోధన, రోగుల సంరక్షణలో విస్తృత సేవలు అందిస్తూ… శరవేగంగా నిర్మాణం పూర్తి చేసుకుంటోంది.
బీబినగర్ ఎయిమ్స్‌లో ఇప్పటి వరకు
పనుల పురోగతి: 86% పూర్తి
🎓 వైద్య విద్య & పరిశోధన:
🏥ఇప్పటివరకు 7 బ్యాచ్‌లలో 609 మంది MBBS విద్యార్థులు ప్రవేశం పొందారు.
🏥24 విభాగాలలో పీజీ (PG) కోర్సులు అందుబాటులో ఉన్నాయి; ప్రస్తుతం 133 మంది రెసిడెంట్ డాక్టర్లు సేవలందిస్తున్నారు.
🏥 7 విభాగాలలో సూపర్ స్పెషాలిటీ శిక్షణ కొనసాగుతోంది.
🏥నర్సింగ్ మరియు అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సులు వేగంగా విస్తరణ
🩺రోగుల సంరక్షణ
🏥ఇప్పటివరకు 14.95 లక్షల మందికి పైగా ఓపిడి (OPD) రోగులకు చికిత్స అందించారు.
🏥20 లక్షలకు పైగా ల్యాబ్ & డయాగ్నోస్టిక్ పరీక్షలు నిర్వహించారు.
🏗️ మౌలిక సదుపాయాలు:
🏥 అకడమిక్ బ్లాక్, హాస్టళ్లు, ఆయుష్ భవనాలు సిద్ధం.
🏥2026 నాటికి కొత్త హాస్పిటల్ బ్లాక్‌లు, అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి!
ప్రపంచస్థాయి వైద్య విద్యను, ఆరోగ్య సేవలను సామాన్యుడికి చేరవేసే దిశలో ఎయిమ్స్ బీబినగర్ తన ప్రగతి ప్రస్థానం కొనసాగిస్తూ… తెలంగాణ ఆరోగ్య రంగానికి తలమానికంగా నిలుస్తోంది.



