ఏపీ విషయంలో బిజెపి గట్టి ప్లాన్ తో ఉందా? బలమైన పునాదులు వేసుకోవాలని భావిస్తోందా? అది జరగాలంటే బలమైన ప్రాంతీయ పార్టీలుగా ఉన్న టిడిపి, వైసీపీ బలహీనం కావాలి. అందుకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ద్వారా భారీ స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో బిజెపి అధికారంలోకి రావాలన్నదే అభిమతంగా కనిపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ ద్వారా బిజెపి రాజకీయ వ్యూహానికి తెర తీసినట్లు సమాచారం. ఇటీవల తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయ ఆలయాన్ని పవన్ కళ్యాణ్ సందర్శించిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఆలయ అభివృద్ధికి 35 కోట్ల రూపాయల టీటీడీ నిధులు కేటాయించేలా చేశారు పవన్ కళ్యాణ్. దీని వెనుక తెలంగాణలో రాజకీయ వ్యూహం ఉన్నట్లు అర్థమవుతోంది. తెలంగాణలో జనసేన బలం పెంచడంతోపాటు బిజెపికి మద్దతుగా నిలిచి ఊపు తేవాలన్నదే లక్ష్యంగా కనిపిస్తోంది.
* తెలంగాణలో సహకారం..
2028 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి గట్టిగానే తలపడబోతోంది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో( general election) అధికార కాంగ్రెస్ పార్టీకి ధీటుగా రాష్ట్రంలో 8 ఎంపీ సీట్లను కైవసం చేసుకుంది బిజెపి. ఇప్పుడు అదే ఊపును కొనసాగిస్తూ పవన్ కళ్యాణ్ ద్వారా జనసేన ను బలోపేతం చేయాలని చూస్తోంది. మెగా ఫ్యాన్స్ కు తోడు జనసైనికులు అండగా నిలిస్తే బిజెపి అధికారంలోకి రావడం ఈజీ అనిపిస్తోంది. అందుకే పవన్ కళ్యాణ్ ద్వారా తెలంగాణలో బలపడేందుకు అవసరమైన అన్ని వ్యూహాలను అమలు చేస్తోంది బిజెపి.
* కీలక భాగస్వామిగా.. తెలంగాణలో( Telangana) బిజెపి అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్ కు వచ్చే లాభం ఏమిటనేది ఇప్పుడు ప్రశ్న? అయితే తెలంగాణలో అధికారంలోకి వస్తే ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా మారుతుంది జనసేన. ఆపై ఏపీలో 2029లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ను ప్రకటిస్తారని తెలుస్తోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పరస్పర రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా బిజెపి, జనసేన అడుగులు వేస్తున్నట్లు స్పష్టం అవుతుంది. అయితే ఈ కీలక ప్రతిపాదన వెనుక కేంద్ర హోం మంత్రి అమిత్ షా గట్టి చొరవ తీసుకున్నట్లు సమాచారం. అమిత్ షా తో పాటు కేంద్ర పెద్దల నుంచి వచ్చిన ఈ ప్రతిపాదనకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది.
* టిడిపి ఒప్పుకోకపోతే..
ప్రస్తుతం ఏపీలో జనసేన( janasena) బలం పెరిగింది. ఓటు షేర్ కూడా పెరిగింది. 12 శాతం నుంచి 20 శాతానికి పెరిగే అవకాశం కనిపిస్తోంది. అదే సమయంలో బిజెపి బలం కూడా పెంచుకుంది ఏపీలో. అందుకే టిడిపిని ఒప్పించి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా చేయించడం ఒక ఆప్షన్. టిడిపి ఒప్పుకోకపోతే.. పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి బిజెపి, జనసేన ఉమ్మడిగా వెళ్లడం. ఇలా ఎలా చూసుకున్నా 2029లో పవన్ కళ్యాణ్ ఏపీకి ముఖ్యమంత్రి కావడం ఖాయంగా తెలుస్తోంది.
* బలమైన మిత్రుడిగా..
ఇటీవల ఇతర రాష్ట్రాల్లో మిత్రపక్షాల విషయంలో బిజెపి( Bhartiya Janata Party) వైఖరి ఏ విధంగా ఉందో అర్థమవుతుంది. జనసేన ను బలమైన మిత్రపక్షంగా భావిస్తోంది బిజెపి. పవన్ సనాతన ధర్మ పరిరక్షణ వెనుక బిజెపి వ్యూహం ఉంది. పైగా దక్షిణాది రాష్ట్రాల్లో బిజెపికి పవన్ ఒక బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా బీజేపీ పవన్ కళ్యాణ్ కు ప్రత్యేకంగా ఆహ్వానిస్తోంది. తద్వారా పవన్ కళ్యాణ్ ను ఓ జాతీయ నాయకుడిగా ప్రమోట్ చేస్తోంది. అయితే మున్ముందు పవన్ కళ్యాణ్ సేవలు మరింతగా ఉండను ఉండడంతో.. ఏపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలనుకుంటుంది. తద్వారా చరిష్మ ఉన్న నేతల్లో పవన్ కళ్యాణ్ ను గుర్తించింది కేంద్రం. మరి ఇందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.



