నిత్యం వందల సమస్యల మధ్య గడిచే జీవితానికి,
బోలెడంత ఊతం ఇచ్చేమెవి మూడు..
ఒకటి మంచి తోడు, రెండోది చక్కటి మాట, మూడోది నిష్కల్మషపు సేవ!
అంతే కదా, కష్టాన్ని ఎదురుకోడానికి,
కూడా పక్కన ఓ మనిషి,
అది పంచుకోడానికి ఒక మనస్సు,
అది ఇంకొకరికి రాకుండా చేయగలిగే ప్రయత్నం.. ఇవే కదా
మనకి ఆక్సిజన్ లా పనిచేసేవి!
అందుకే ఈ మూడింటిని అనుసంధానిస్తూ,
ఒక కొత్త ప్రయత్నానికి శ్రీకారం చుడుతున్నాను!
‘సర్వేజనా’ ఇక కేవలం ఒక ఆలోచన, ఆశ మాత్రమే కాకుండా
నన్ను అభిమానించే, నాతో కలిసి నడిచే
మీరందరిలోకూడా ఒక భాగంగా చేయడానికి..
ప్రతీ సోమవారం, ‘సర్వేజనా’ స్పృహ తో
మిమ్మల్ని అందరిని స్పృశించాలని అనుకుంటున్నాను!
సర్వేజనా లో జరిగే కార్యక్రమాలు కావొచ్చు,
అక్కడ మేము తెలుసుకునే వాస్తవాలు కావొచ్చు,
బయట ప్రజలు పడే ఇబ్బందులు కావొచ్చు,
వాటి వెనక నలిగిన కథలు కావొచ్చు,
దానికి మనపై వున్న బాధ్యతలు కావొచ్చు,
వీటన్నిటిని కలగలిపి,
సర్వేజనా సోమవారాలు అనే శీర్షికన,
ప్రతి సోమవారం మిమ్మల్ని సోషల్ మీడియా మాధ్యమాన కలుస్తాను!
మీ అభిప్రాయాలు తెలుసుకుంటాను,
మీ తోడుని కోరుకుంటాను!
మందులు రాసే ప్రిస్క్రిప్షన్ పేపర్లు కాక,
కథలు రాసే గురవాయనం కాక,
సమాజం కోసం ప్రతి సోమవారం, నా కలాన్ని పట్టి,
సర్వేజనా తో నేను కన్న కలలని,
మీ వరకు మరింత దెగ్గరగా తీసుకురావాలనే ప్రయత్నం చేస్తాను!
చేసి పని వెనక మంచి మనస్సు ఉంటే చాలు,
ఆ మంచే దారమై మనుష్యుల్ని మనతో కలుపుతుంది,
ఎంతటి తీరమైన, తానై ఎదురవుతుందని మా అమ్మే చెప్పేది,
అదే నమ్మకంతో.. ఇదో ప్రయత్నం..
వచ్చే సోమవారం, ‘సర్వేజనా’ పిలుపు తో మళ్ళీ కలుద్దాం..



