ఒక్క భారతదేశం( India) పైనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్ దుశ్చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రధానంగా సిక్కు, హిందూ మతాలను టార్గెట్ చేస్తున్నాయి. ఆ రెండు మతాలపై దుశ్చర్యలను కొనసాగిస్తున్నాయి పాకిస్తాన్ మూకలు. విదేశాల్లో స్థిరపడిన భారతీయులకు, ముఖ్యంగా మైనారిటీ వర్గాలకు భద్రత కరువవుతోంది పాకిస్తాన్ నుంచి. బ్రిటన్ లోని పశ్చిమ లండన్ ప్రాంతంలో ఇటీవల ఒక దారుణ ఘటన వెలుగు చూసింది. అంతర్జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ అయింది. పాకిస్తాన్ మూలాలు ఉన్న వ్యక్తులు నడుపుతున్న గైమింగు గ్యాంగులు ఒక సిక్కు బాలికను కిడ్నాప్ చేసి.. బంధించి.. దారుణంగా రేప్ చేయడం తీవ్ర కలకలం రేపింది.
అంతర్జాతీయ దినపత్రిక ‘ది సండే గార్డియన్’ సంచలన కథనం ప్రచురించింది. పశ్చిమ లండన్ లోని( West London) హౌన్స్ ప్రాంతంలో 15 సంవత్సరాల సిక్కు బాలికను పాకిస్తాన్ మూలాలు ఉన్న ఆరుగురు సభ్యుల ముఠా కిడ్నాప్ చేసింది. ఆ బాలికను ఒక రహస్య ప్లాట్లో బంధించి.. ఆరుగురు వ్యక్తులు దారుణంగా అత్యాచారం చేశారు. ఆ వీడియోను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ విషయం బయటపడింది.
* చేతులెత్తేసిన పోలీసులు..
లండన్ లో ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. అంతర్జాతీయ సమాజంలో సిక్కు, హిందూ మతాలకు సంబంధించి మహిళలకు రక్షణ కరువవుతోంది. అయితే అక్కడ పోలీసులు కంటే ముందే స్పందించిన సిక్కు సమాజ ప్రతినిధులు, బాధితురాలి ఆచూకీ కనిపెట్టారు. సుమారు 300 మంది సిక్కు యువకులు నిందితుడి ఇంటిని ముట్టడించారు. పోలీసులు సైతం చేతులెత్తేశారు. వారి సాయం లేకుండానే ఆ బాలికను వారు సురక్షితంగా రక్షించుకోవడం గమనార్హం.
* అత్యంత ప్రమాదకరం..
బ్రిటన్ లో( Britain ) ఈ ముఠాల పనితీరు చాలా ప్రమాదకరంగా ఉంటుంది. సాధారణంగా 11 నుంచి 16 సంవత్సరాలలోపు వయసున్న యువతులను వీరు టార్గెట్ చేస్తారు. ముందుగా ప్రేమ, స్నేహం పేరుతో దగ్గరవుతారు. ఖరీదైన బహుమతులతో ఆకట్టుకుంటారు. ప్రధానంగా సిక్కు, హిందూ మతాలకు చెందిన అమ్మాయిలను టార్గెట్ చేస్తారు. ఒక్కసారి తమ వలలో చిక్కుకున్నాక.. వారిని డ్రగ్స్ లేదా బెదిరింపులతో లొంగదీసుకుని సామూహిక అత్యాచారాలు చేస్తారు. లైంగిక దోపిడీలకు పాల్పడుతుంటారు.
* సంచలన నివేదిక..
అయితే దశాబ్దాలుగా ఈ దురాఘతాలు జరుగుతూనే ఉన్నాయి. 2014లో వెలువడిన అలెక్సిస్ జే( Alexis J) నివేదిక సంచలన విషయాలను బయటపెట్టింది. బ్రిటన్ ప్రభుత్వమే షాక్ కు గురైంది. ఒక్క రోధర్ హోం పట్టణంలోనే 1997 నుంచి 2013 మధ్య సుమారు 1400 మంది చిన్నారులు లైంగిక దోపిడీకి గురయ్యారని ఆ నివేదిక తేల్చింది. ఆ నేరాలకు పాల్పడుతున్న వారిలో అధిక శాతం పాకిస్తానీ మూలాలు ఉన్నవారేనని స్పష్టమైంది. అయితే ఇంత జరుగుతున్నా బ్రిటన్ ప్రభుత్వం వెనక్కి తగ్గడానికి అనేక కారణాలు ఉన్నాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటే జాతి వివక్ష ఆరోపణలు వస్తాయనే భయంతోనే అక్కడి పోలీసులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
* కట్టడి చేయకుంటే కష్టం..
తాజాగా జరిగిన ఈ ఘటన యునైటెడ్ కింగ్డమ్( United kingdoms ) చట్టబద్ధతను ప్రశ్నిస్తోంది. ఇటువంటి ఘటనలను ఉదాసీనంగా విడిచి పెడితే ఆదేశానికి ప్రమాదం. తప్పకుండా ఆ అల్లరి మూకలు, గ్యాంగులు తప్పకుండా విరుచుకుపడతాయి. తమ దేశంలో పెరుగుతున్న మత చాందసవాదం, వ్యవస్థీకృత నేరాల ముఠాలను అదుపు చేయకపోతే శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించే ప్రమాదం ఉంది. భారత ప్రభుత్వం సైతం ఈ ఘటనపై స్పందించింది. భారతీయ మూలాలు ఉన్న మైనారిటీల భద్రత గురించి యూకే అధికారులతో చర్చించే ప్రయత్నం చేస్తోంది.



