కర్నూలు జిల్లాలో ఘనంగా పిడకల సమరం
కర్నూలు జిల్లా ఆస్పరి మండలం కైరుప్పల గ్రామంలో శ్రీ వీరభద్ర స్వామి, కాళికాదేవి ప్రేమకు చిహ్నంగా పిడకల సమరం వేడుక ఘనంగా జరిగింది. గ్రామంలో ప్రజలు రెండు వర్గాలుగా ఏర్పడి ఒకరిపై మరొకరు పిడకలతో కొట్టుకోవడం వింత ఆచారం కొనసాగుతోంది. దాదాపు చుట్టుపక్కల తొమ్మిది గ్రామాల ప్రజలు ఈ వేడుకలో పాల్గొనడంతో పాటు కారుమంచి గ్రామానికి చెందిన రాజవంశీకులు నరసింహారెడ్డి గుర్రంపై వచ్చి వీరభద్ర స్వామి కాళికాదేవి అమ్మవారిని దర్శించిన అనంతరం పిడకల సమరం ప్రారంభమైంది. యాదవులు, హరిజనులు,కంసల పలు ఇతర కులాల కాళికాదేవి వైపు.. లింగాయతులు ,కురువ ,తదితర కులాలు వీరభద్ర స్వామి వైపు నిలబడి నుగ్గులు ఒకరిపై ఒకరు కొట్టుకున్నారు. ఈ ఉత్సవాన్ని తిలకిచ్చేందుకు వేల సంఖ్యలో పాల్గొన్నారు. పూర్వకాలం నుండి ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారని మేము కూడా ఈ ఆచారాన్ని పాటిస్తున్నామని గ్రామ యువకులు తెలిపారు. ఈ ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చేరకుండా ఆలూరు సిఐ రవి శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ బందువస్తు ఏర్పాటు చేశారు.



