Home » Latest » ప్రతి రీజియన్‌లో ఐఐటీ, నీట్ కోచింగ్ సెంటర్లు: విద్యాశాఖ సమీక్షలో మంత్రి నారా లోకేష్ కీలక ఆదేశాలు

ప్రతి రీజియన్‌లో ఐఐటీ, నీట్ కోచింగ్ సెంటర్లు: విద్యాశాఖ సమీక్షలో మంత్రి నారా లోకేష్ కీలక ఆదేశాలు

Published By: BharattodayTV Team
Published On
IND vs SA T20

ప్రత్యేక శిక్షణ: ప్రతి రీజియన్ పరిధిలో 4 ఏపీ రెసిడెన్షియల్, 4 కెజిబివిల్లో ఐఐటీ-నీట్ శిక్షణ కేంద్రాల ఏర్పాటు

మనబడి – మన భవిష్యత్తు: పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కోసం రూ.2,034 కోట్ల సమీకరణకు ప్రణాళిక

విద్యా ప్రమాణాలు: విద్యార్థులు జాతీయ స్థాయి ర్యాంకులు సాధించేలా విద్యా ప్రమాణాల మెరుగుదలకు దిశానిర్దేశం

Amaravathi:    ఉండవల్లి నివాసంలో ఇంటర్మీడియట్, ఉన్నత విద్య, స్కిల్ డెవలప్ మెంట్ శాఖల అధికారులతో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి రీజియన్ పరిధిలో 4 ఏపీ రెసిడెన్షియల్, 4 కెజిబివిల్లో కోచింగ్ సెంటర్లు ఏర్పాటుచేసి, ఐఐటీ- నీట్ ర్యాంకులు సాధించేలా ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. అన్ని స్కూళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు మనబడి – మన భవిష్యత్తు కింద రూ.2,034 కోట్లు సమీకరించాలని సూచించారు. విద్యా ప్రమాణాల మెరుగుదలకు కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు.

 

Share to...