ఆరోగ్యకరమైన ఆహారం.. స్వచ్ఛమైన వస్తువులు.. తార్నాకలో మూలం సంత!
నగరంలో పల్లె వాతావరణం: మూలం సంతలో ప్రకృతి సిద్ధమైన ఉత్పత్తులు.
సిరిధాన్యాల భోజనం నుంచి చేనేత వస్త్రాల వరకు – అన్నీ ఒకే చోట!
ప్రకృతి ప్రేమికుల సంగమం: ప్రతి నెలా రెండో శనివారం మూలం సంత.
ప్రతీ నెలా రొండో శనివారం సికింద్రాబాద్ తార్నాక మర్రి కృష్ణ రెడ్డి హాల్ లో #మూలం_సంత అని జరుగుతుంది..అక్కడ అన్ని ప్రకృతి సిద్ధమైన వస్తువులు దొరుకుతాయి.చిరు తిండి దగ్గరనుంచి చాలా ఉంటాయి, చేనేత వస్త్రాలు, ఆవు నెయ్యి, తేనె ఇలా ఒకటి కాదు చాలా ఉంటాయి స్టాల్ల్స్ పెడతారు..మిద్దె తోట కోసం రకరకాల దేశీయ విత్తనాలు ఉంటాయి..కూరగాయలు దొరుకుతాయి ప్రకృతి సిద్ధంగా పండించినవి. కెమికల్ లేని డిటర్జెంట్స్, చెక్క గానుగ నూనె ఇలా చాలా ఉంటాయి..
ప్రత్యేకించి అక్కడ భోజనం కోసం, కోర్రలతో చేసిన మంచి ఆహారం పెడతారు..కాస్తా ఖరీదు ఎక్కువ గా అనిపించినా మంచి ఆహారం…ఇంకా ఫ్రూట్ ఐస్క్రీం కూడా చాలా బాగుంటుంది. తార్నాక మెట్రో నుంచి కేవలం ఒక కిలోమీటర్ ఉంటుంది.. మన సంస్కృతి , ప్రకృతి, సంప్రదాయాలు ఇక్కడ వారి మాటల్లో అలాగే చేతల్లో , వస్తువుల్లో కనిపిస్తాయి..అలాగే కొంతమంది ప్రకృతి ప్రేమికులను కలుసుకునే అవకాశం కూడా మనకి దొరుకుతుంది.



