Home » Latest » Modi:బిజెపి నేతలకు మోడీ వార్నింగ్

Modi:బిజెపి నేతలకు మోడీ వార్నింగ్

Published By: BharattodayTV Team
Published On
IND vs SA T20

బిజెపి ( Bhartiya Janata Party) తెలంగాణపై ఫుల్ ఫోకస్ పెట్టిందా? వచ్చే ఎన్నికల్లో అక్కడ అధికారాన్ని హస్త గతం చేసుకోవాలని భావిస్తోందా? అందుకు తగ్గట్టు గ్రౌండ్ వర్క్ జరుగుతోందా? అంటే అవుననే సమాధాన వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. ప్రస్తుతం అక్కడ అధికార పార్టీగా కాంగ్రెస్ ఉంది. ప్రధాన ప్రతిపక్షంగా బిఆర్ఎస్ ఉంది. కానీ బిఆర్ఎస్ రోజురోజుకు బలహీనపడుతోంది. అలాగని కాంగ్రెస్ పార్టీ సైతం ప్రజల్లో ఆదరణ పెంచుకోవడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో బిజెపి బలోపేతం కావాల్సి ఉంది. కానీ అనుకున్న స్థాయిలో ఆ పార్టీ ముందుకెళ్ల లేకపోతోంది. గతం మాదిరిగా దూకుడు తనం ప్రదర్శించలేకపోతోంది.

బిజెపి నిండా కెసిఆర్ మనసులే

 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది స్థానాలకు మాత్రమే పరిమితం అయింది భారతీయ జనతా పార్టీ. ఆ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగింది. కానీ సింగిల్ డిజిట్ కు పరిమితం అయింది. అయితే అక్కడకు 8 నెలల వ్యవధిలోనే 2024 సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీకి సమానంగా 8 ఎంపీ సీట్లను కైవసం చేసుకుంది. తద్వారా వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారం బిజెపి దే అన్నట్టు పరిస్థితి మారింది. కానీ ఎందుకో ఇటీవల బీజేపీలో క్రమశిక్షణ కట్టు దాటుతోంది. సమన్వయం ఆశించిన స్థాయిలో కనిపించడం లేదు.

నేతలంతా చెట్టుకొకరు పుట్టకొకరు

 తెలంగాణ బిజెపిలో నాయకులకు కొదవలేదు. కానీ వారి మధ్య సమన్వయమే లేదు. పాత కొత్త బీజేపీ నేతల మధ్య చిన్నపాటి సమన్వయ లోపం ఉంది. అందుకే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయని తెలుస్తోంది. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ బిజెపి ఎంపీలతో సమావేశం నిర్వహించారు. వారి నుంచి ఫీడ్ బ్యాక్ తెలుసుకున్నారు. అసలు ఎందుకు మునుపటిలా దూకుడు ప్రదర్శించడం లేదని ప్రశ్నించారు. చాలామంది ఎంపీలు వెనుకబడి ఉన్నారని.. పెద్దగా పనితీరు కనబరచలేకపోతున్నారని ప్రధాని అభిప్రాయ పడినట్లు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో పార్టీ బలపడాలని.. అధికారంలోకి రావాలని ప్రధాని దిశా నిర్దేశం చేసినట్లు సమాచారం.

కేంద్ర మంత్రులకు పరోక్ష హెచ్చరిక

 ప్రస్తుతం బిజెపికి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు తెలంగాణ నుంచి. వచ్చే విస్తరణలో మరొకరికి అవకాశం ఇచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ మరింత దూకుడుగా వెళ్లి ప్రజల్లో పట్టు సాధిస్తే కష్టమని బిజెపి భావిస్తోంది. అందుకే పెద్ద ఎత్తున పార్టీలో చేరికలు పెరగాలని ఆశిస్తోంది. అందులో భాగంగానే బిఆర్ఎస్ పార్టీ వైపు ఫుల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఆ పార్టీకి చెందిన కీలక నేతలు బిజెపిలోకి వస్తారని సమాచారం. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణపై ఫుల్ ఫోకస్ చేయాలన్నది బిజెపి ఆలోచన. తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికల తరువాత తెలంగాణ ఎన్నికలపై వ్యూహరచన మొదలుపెట్టనుంది కాషాయ పార్టీ. మొత్తానికి అయితే తెలంగాణలో బలపడేందుకు బిజెపి ప్రయత్నాలు మొదలుపెట్టడంతో ఆ ప్రభావం బిఆర్ఎస్ పై పడనుంది. దీంతో ఆ పార్టీలో కలవరం మొదలైంది.

Share to...