Home » Latest » దురంధర్ రివ్యూ: బన్నీ, మహేశ్, తారక్ ఫిదా.. ఆదిత్య ధర్ సృష్టించిన ఈ ‘పరశురాముడి’ భారతం చూడాల్సిందే!

దురంధర్ రివ్యూ: బన్నీ, మహేశ్, తారక్ ఫిదా.. ఆదిత్య ధర్ సృష్టించిన ఈ ‘పరశురాముడి’ భారతం చూడాల్సిందే!

Published By: BharattodayTV Team
Published On
IND vs SA T20

ధురంధర్ 2 పై ఇప్పటివరకు అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, తారక్, మహేశ్ బాబు లు అదిరిపోయే రివ్యూలు ఇచ్చారు.. ప్రతీ భారతీయుడు గర్వపడేలా సినిమా ఉంది అని డైరెక్టర్ ఆదిత్య ధర్ ని మెచ్చుకుంటున్నారు.👌🏽 భారతీయ సినిమాకు కొత్త రూపు తెచ్చాడు ఆదిత్య ధర్. భారతీయులు పిరికి స్వభావులు, బలహీనులు, గాంధేయవాదులు అనే విధంగా ప్రచారం చేశారు సినిమాల ద్వారా ఇన్నేళ్లు, కానీ మనం అవసరం పడితే ధర్మాన్ని కాపాడడం కోసం, భారతదేశాన్ని కాపాడడం కోసం హింసను సైతం ఎంచుకుంటాం, భీకరంగా పోరాడుతాం, ప్రతీకారం తీర్చుకునేందుకు పరశురాముడి అవతారం ఎత్తుతాం అనే విధంగా ఈ దురంధర్ సినిమా ద్వారా చాటిచెప్పాడు ఆదిత్య ధర్. పాకిస్థాన్ మనపై ఇన్నేళ్లుగా తీవ్రవాద దాడులు చేసి భారతీయులను చంపడం వెనుక ఉన్న కారణం ఏంటంటే మనం తిరిగి వాళ్లను అదేరీతిలో చావుదెబ్బ కొట్టకపోవడమే. మన సహనం బలహీనతగా భావించారు వాళ్లు.. కానీ ఇక పై ప్రతీకారం తీర్చుకునేందుకు వెనకడుగు వేయకూడదు. ఈ సినిమా ద్వారా భారతీయుల మనసు తప్పనిసరిగా మారుతుంది, అందులో సందేహం లేదు. మన భారతదేశాన్ని వినాశనం చేయాలని చూసే శతృవులు భారతీయుల సహనాన్ని పరీక్షిస్తే ఏం జరుగుతుందో తెలుసుకుంటారు‌ కూడా.

 

Share to...