Home » Latest » Brs: గులాబీ పార్టీకి ‘గడ్డం’ బ్రేక్.. షాక్ ఇచ్చిన స్పీకర్!

Brs: గులాబీ పార్టీకి ‘గడ్డం’ బ్రేక్.. షాక్ ఇచ్చిన స్పీకర్!

Published By: BharattodayTV Team
Published On
IND vs SA T20

తెలంగాణలో( Telangana) గులాబీ పార్టీ ఆశలను గల్లంతు చేశారు స్పీకర్. అక్కడ ఏదేదో జరుగుతుందనుకుంటే.. ఇంకేదో జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో పార్టీ మారిన పదిమంది ఎమ్మెల్యేల వ్యవహారం తీవ్ర దుమారానికి దారితీసింది. వారిపై అనర్హత వేటు వేయాలన్న గులాబీ పార్టీ డిమాండ్ కు తలొగ్గ లేదు స్పీకర్. వారిపై అనర్హత వేటు వేయాలని టిఆర్ఎస్ న్యాయస్థానాలను ఆశ్రయించింది. అనేకసార్లు విచారణ జరిగిన తర్వాత పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ను న్యాయస్థానాలు ఆదేశించాయి. కానీ స్పీకర్ మాత్రం విభిన్న ఆదేశాలు ఇచ్చారు. కీలక నిర్ణయం తీసుకున్నారు.

* పార్టీ ఓటమితో..
2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ( Congress Party) విజయం సాధించింది. దీంతో బిఆర్ఎస్ పార్టీకి చెందిన తెల్లం వెంకట్రావ్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, అరికెపూడి గాంధీ పై అనార్హత వేటు వేయాలని గులాబీ పార్టీ డిమాండ్ చేసింది. స్పీకర్ను కోరగా ఆయన పట్టించుకోకపోవడంతో కోర్టులను ఆశ్రయించింది. అయితే వారి పై విచారణ చేపట్టి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ను ఆదేశించాయి న్యాయస్థానాలు. అయితే ఈ ఐదుగురు పై దాఖలైన అనర్హత పిటిషన్లను స్పీకర్ కొట్టివేశారు. ఈ ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు ఆధారాలు చూపించలేకపోయారని స్పీకర్ ఆ తీర్పులో పేర్కొన్నారు. అనర్హత వేటు వేసేందుకు ఆధారాలు లేవని.. సాంకేతిక పరంగా ఆ ఎమ్మెల్యేలు గులాబీ పార్టీలో ఉన్నట్టు స్పీకర్ గడ్డం ప్రసాద్ తన తీర్పులో పేర్కొన్నారు.

* మొత్తం పదిమంది ఎమ్మెల్యేలపై..
మొత్తం పదిమంది ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లను దాఖలు చేశారు. అందులో ఎనిమిది మందికి సంబంధించిన విచారణ పూర్తయింది. కడియం శ్రీహరి( kadiyam Srihari), దానం నాగేందర్ పై దాఖలైన పిటిషన్లపై ఇంతవరకు విచారణ పూర్తి కాలేదు. ఈ డాక్టర్జంలో ఆ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని గులాబీ పార్టీ సుప్రీంకోర్టులోనే ఏకంగా పిటిషన్ దాఖలు చేసింది. అయితే రేపు సుప్రీంకోర్టులో దీనిపై విచారణ జరిగే అవకాశం ఉంది. ఇంతలోనే ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై విచారణ పూర్తి చేశారు. ఐదుగురికి సంబంధించిన కీలకతీర్పును వెల్లడించారు. అయితే కాలా యాదయ్య, సంజయ్, శ్రీనివాస్ రెడ్డి పై ఈరోజు స్పీకర్ తీర్పు చెప్పే అవకాశం ఉంది. అయితే స్పీకర్ గడ్డం ప్రసాద్ తీరుపై గులాబీ పార్టీ ఆగ్రహంగా ఉంది. అవసరం అనుకుంటే స్పీకర్ పై కూడా అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

* పదేపదే న్యాయస్థానాలను ఆశ్రయించి..

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని పదేపదే న్యాయస్థానాల గుమ్మం తొక్కింది గులాబీ పార్టీ. వాస్తవానికి గులాబీ పార్టీ న్యాయస్థానాల ద్వారా కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి తేవాలని భావించింది. ఇందులో కొంతమేర సక్సెస్ అయ్యింది కూడా. కానీ స్పీకర్ గడ్డం ప్రసాద్ గులాబీ పార్టీకి షాక్ ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. స్పీకర్ తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో ఆ ఎమ్మెల్యేలు ఇక కాంగ్రెస్ పార్టీలోనే అనధికారికంగా కొనసాగుతారని అర్థమవుతోంది. ఇప్పటికే పంచాయితీ ఎన్నికల్లో జోరు మీద ఉన్న కాంగ్రెస్ పార్టీకి.. అసెంబ్లీ స్పీకర్ గట్టి బూస్ట్ ఇచ్చారు.

Share to...