విజయవాడ: కేరళ రాజకీయాల్లో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసేందుకు ఢిల్లీ వెళ్తున్న తిరువనంతపురం కార్పొరేటర్లకు విజయవాడ రైల్వే స్టేషన్‌లో ఘన స్వాగతం లభించింది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్ నేతృత్వంలో పార్టీ శ్రేణులు వారికి ఘనంగా ఆతిథ్యం ఇచ్చారు.
మోడీ పిలుపుతో ఢిల్లీకి ప్రయాణం
తిరువనంతపురంలో విజయం సాధించిన 56 మంది కార్పొరేటర్లను ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ఢిల్లీకి ఆహ్వానించారు. వీరంతా కేరళ ఎక్స్‌ప్రెస్‌లో ఢిల్లీ వెళ్తుండగా, విజయవాడలో ఏపీ బీజేపీ విభాగం వారికి మధ్యాహ్న భోజన వసతితో పాటు సాదర స్వాగతం పలికింది.



