Home » Latest » “కోకాపేటలో అల్లు సినిమాస్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి – హాలీవుడ్‌తో టాలీవుడ్ పోటీ పడాలి”

“కోకాపేటలో అల్లు సినిమాస్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి – హాలీవుడ్‌తో టాలీవుడ్ పోటీ పడాలి”

Published By: BharattodayTV Team
Published On
IND vs SA T20

 సినీ నిర్మాత అల్లు అరవింద్ కుటుంబం కోకాపేటలో నిర్మించిన దేశంలోని అతిపెద్ద డోల్బీ అల్లు సినిమాస్ (Allu Cinemas)ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలంగాణలో ఐటీ, ఫార్మా రంగాల తరహాలో సినిమా ఇండస్ట్రీగా ఎదగాలని ఆకాంక్షించారు. సినిమాలు మధ్య తరగతి వారిపై అత్యంత ప్రభావం చూపిస్తున్నాయని, జీవితంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి, సామాజిక కోణంలో సినిమాలు అత్యంత ప్రభావం చూపిస్తాయని అన్నారు. హాలీవుడ్ సినిమాలను చూడటం కాకుండా మనం తీయగలిగే స్థాయికి ఎదగాలని కోరారు. ఇక్కడి సినిమా రంగం ఒక నాలెడ్జ్ హబ్‌గా ఎదగాలని, నాలెడ్జ్ హబ్ క్రియేట్ చేసినప్పుడే గొప్పగొప్ప సినిమాలు తీయగలమని అన్నారు. తెలుగు సినిమా రంగం పాన్ ఇండియాతో కాకుండా హాలీవుడ్‌తో పోటీ పడాలన్నారు.అల్లు అరవింద్ కుటుంబం ఎంతో ఇష్టంతో నిర్మించిన ఈ డాల్బీ థియేటర్ తెలంగాణకు మంచి పేరు తెస్తుందని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.

Share to...