అనంతపురం JNTU లో జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయాల చట్టాన్ని అతిక్రమించి ఆరేళ్లుగా రిజిస్ట్రార్‌గా కొనసాగుతున్న ప్రొఫెసర్ క్రిష్ణయ్యను తొలగించాలని గవర్నర్‌కు ఏబీవీపీ లేఖ రాసింది. చట్ట విరుద్ధమని గతంలో ABVP ఆందోళనలు నిర్వహించి VC కి, రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసినప్పటికి ఎటువంటి స్పందన లేకపోవడంతో చట్టాన్ని కాపాడాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్( అనంతపురం JNTU కులపతి) కి ABVP నాయకులు ఫిర్యాదు చేస్తూ లేఖ రాసినట్టు ABVP రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అఖిల్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ లేఖను గవర్నర్ కి మెయిల్ ద్వారా, రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపినట్లు అనంతపురం ABVP కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో తెలిపారు. ప్రస్తుతం ఉన్న రిజిస్ట్రార్ గతంలో రిజిస్ట్రార్ ఉన్న సమయంలో అనేకమైనటువంటి అక్రమాలు,అవినీతికి పాల్పడ్డారని ప్రస్తుతం రిజిస్ట్రార్ గా ఉన్న తనను మార్పు చేస్తే అవన్నీ కూడా బహిర్గతం అవుతాయని క్రిష్ణయ్య ఆందోళన చెందుతున్నారని తెలిపారు. గతంలో ఇతను చేసిన అవినీతి,అక్రమాల ఆధారాలను లేఖకు జతపరిచినట్టు తెలిపారు. రాష్ట్ర గవర్నర్ ఈ విషయంపై స్పందించి విశ్వవిద్యాలయంలో చట్టాన్ని అతిక్రమించకుండా, రిజిస్ట్రార్ చట్టానికి లోబడి మార్పు చేస్తారని, చట్టాన్ని కాపాడేలా చర్యలు తీసుకుంటారని విశ్వాసంగా ఉన్నామని తెలిపారు.సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు విజయ్,రాష్ట్ర లా ఫోరం కో కన్వీనర్ నాగర్జున,రాష్ట్ర సోషల్ మీడియా కో కన్వీనర్ విజయ్, నగర సంఘటన కార్యదర్శి అంకిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
JNTU అనంతపురం రిజిస్ట్రార్‌పై గవర్నర్‌కు ABVP ఫిర్యాదు !
Tags:
ABVP ABVP Complaint Anantapur APGovernor EducationNews JNTUAnantapur JNTUARegistrar Registrar Krishnaiah
Related News



