Home » Culture » తెలంగాణ వారసత్వానికి జాతీయ గుర్తింపు

తెలంగాణ వారసత్వానికి జాతీయ గుర్తింపు

Published By: BharattodayTV Team
Published On
IND vs SA T20

ప్రధాని నరేంద్ర మోడీ దార్శనిక నాయకత్వంలో, కాకతీయ వైభవానికి మరో అరుదైన గుర్తింపు లభించింది. ములుగు జిల్లా పాలంపేటలోని శివాలయం, గొల్లాల గుళ్లను భారత పురావస్తు శాఖ ‘జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక చిహ్నాలు’గా ప్రకటించింది. ఈ రెండు కట్టడాలతో కలిపి, తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం రక్షణలో ఉన్న స్మారక కట్టడాల సంఖ్య 10కి చేరింది. ఇప్పటికే యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయంతో పాటు, ఇప్పుడు ఈ కట్టడాలకు లభించిన జాతీయ హోదా, మన పురాతన సంపదను భావి తరాలకు అందించేందుకు మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న  గొప్ప చర్యగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

Share to...