తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో 25 రోజుల పాటు జరుగనున్న అధ్యయనోత్సవాలు శుక్రవారం సాయంత్రం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు రంగనాయకుల మండపంలో అధ్యయనోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు.ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశికి 11 రోజులు ముందు నుండి శ్రీవారి సన్నిధిలో అధ్యయనోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.ఈ సందర్భంగా స్వామివారి ప్రాశస్త్యంపై 12 మంది ఆళ్వార్లు రచించిన దివ్యప్రబంధ పాశురాలను శ్రీవైష్ణవ జియ్యంగార్లు గోష్ఠిగానం చేస్తారు.
Tirumala: శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు
Tags:
AndhraPradesh govinda TIRUMALA Tirumala latest news tirumalahills tirumalatirupatidevasthanam tirupati tirupatibalaji తిరుమల సమాచారం శ్రీవారి దర్శనం
Related News



