నంద్యాల జిల్లా ప్రముఖ శైవ క్షేత్రమైన మహానంది పుణ్యక్షేత్రంలో ఆదివారం రాత్రి మహాలింగోద్భవ, మహా రుద్రాభిషేకం కార్యక్రమాన్ని పండితులు రవిశంకర అవధాని, ప్రధానార్చకులు అర్జున శర్మల సారథ్యంలో వేదోక్తంగా నిర్వ హించారు. ఆలయ సంప్రదాయం ప్రకారం దొర్నిపాడు మండలం గుండుపాపల, శిరివెళ్ల మండలం గుండం పాడు గ్రామాలకు చెందిన వారు ఇరువైపులా పెళ్లి పెద్దలుగా పాల్గొని నిశ్చితార్థాన్ని పూర్తి చేశారు. నంద్యాల ఆర్డీవో చల్లా విశ్వనాథ్, దేవస్థానం ఈవో నల్లకాల్వ శ్రీనివాసరెడ్డితోపాటు భక్తులు పాల్గొన్నారు. ఇక మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో వైభవంగా వృషభవాహన సేవ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని పుష్పవాహనంపై మంగళ వాయిద్యాలతో ఊరేగించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Mahanandi: మహానందిలో వైభవంగా శివరాత్రి వేడుకలు
Tags:
AndhraPradeshTemples Brahmotsavam Lingodbhavam LordShiva Mahanandi MahaRudrabhishekam Nandyal Shivaratri2026 Spiritual TeluguNews
Related News



