Home » Bhakti » TTD DIARIES AND CALENDARS: టీటీడీ క్యాలెండర్లు, డైరీలకు భక్తుల నుంచి విశేష స్పంద‌న‌

TTD DIARIES AND CALENDARS: టీటీడీ క్యాలెండర్లు, డైరీలకు భక్తుల నుంచి విశేష స్పంద‌న‌

Published By: BharattodayTV Team
Published On
IND vs SA T20

TTD DIARIES AND CALENDARS: శ్రీవారి భక్తుల సౌకర్యార్థం టీటీడీ ముద్రించిన 2026 సంవత్సరం క్యాలెండర్లు, డైరీలకు విశేష స్పందన లభిస్తోంది. దేశ విదేశాలల్లోని శ్రీ‌వారి భ‌క్తులు వీటిని కొనేందుకు అమితాసక్తి చూపిస్తున్నారు. ఈ క్యాలెండర్లు, డైరీలు టీటీడీ అత్యంత ఆకర్షణీయంగా ముద్రించి అందుబాటులో ఉంచింది.

ధరలు వివరాలు ఇలా..

* 12 పేజీల క్యాలెండర్ రూ.130,
* డీలక్స్ డైరీ రూ.150,
* చిన్న డైరీ రూ.120,
* టేబుల్‌ టాప్‌ క్యాలెండర్ రూ.75,
* 6 పేజీల 3డి డిజిట‌ల్‌ క్యాలెండర్ రూ.450,
* శ్రీవారి పెద్ద క్యాలెండర్ రూ.20,
* శ్రీ పద్మావతి అమ్మవారి క్యాలెండర్ రూ.20,
* శ్రీవారు, శ్రీపద్మావతి అమ్మవారి క్యాలెండర్ రూ.15
* తెలుగు పంచాంగం క్యాలెండర్ రూ.30
* టీటీడీ స్థానిక ఆల‌యాల క్యాలెండర్లు రూ.130

తిరుమ‌ల, తిరుప‌తిలో ఎక్కడ దొరుకుతాయి..?

తిరుమల, తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం ఎదురుగా సేల్స్ సెంటర్, శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయం సమీపంలోని ధ్యానమందిరం, శ్రీనివాసం, విష్ణునివాసం ప్రాంతాల్లోనూ, తిరుచానూరులో ఉన్న టీటీడీ పబ్లికేషన్ స్టాల్స్‌లలో డైరీలు, క్యాలెండర్లు అందుబాటులో ఉన్నాయి.

బయట ప్రాంతాల్లో ఎక్కడ దొరుకుతాయి..?

చెన్నైలోని శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయాలు, హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ, వైజాగ్‌లోని శ్రీ‌వారి ఆల‌యాలు, ముంబ‌యి, న్యూఢిల్లీ, వేలూరు, కాంచీపురంలోని సమాచార కేంద్రాలు, నెల్లూరు, రాజమండ్రి, కాకినాడ, కర్నూలులోని టీటీడీ కల్యాణ మండపాల్లో కూడా క్యాలెండర్లు, డైరీలు విక్రయిస్తున్నారు. అదేవిధంగా ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామ స్వామివారి ఆలయం, దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామివారి ఆలయాలతో పాటు టీటీడీ అనుబంధ ఆల‌యాల్లో భ‌క్తుల‌ కోసం డైరీలు, క్యాలెండర్లను టీటీడీ సిద్ధంగా ఉంచింది.

ఆన్ లైన్‌లో పొండం ఎలా..?

డైరీలు, క్యాలెండర్లు టీటీడీ వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో భక్తులకు విక్రయిస్తోంది. ఇందులో 12 పేజీల క్యాలెండర్, డీలక్స్ డైరీ, చిన్న డైరీ, టేబుల్‌ టాప్‌ క్యాలెండర్, 6 పేజీల 3డి క్యాలెండర్లను టిటిడి వెబ్ సైట్ www.tirumala.org, ttdevasthanams.ap.gov.in ద్వారా బుక్ చేసుకున్న భ‌క్తుల‌కు తపాలా శాఖ ద్వారా పంప‌బ‌డుతుంది.

డిడి ద్వారా ఎలా పొందాలంటే..?

ఇక భక్తులు డిడి తీసి పంపినా కూడా టీటీడీ క్యాలెండర్‌, డైరీలను పొందవచ్చు. ఇందుకోసం కార్యనిర్వహణాధికారి, టీటీడీ, తిరుపతి పేరిట ఏదైనా జాతీయ బ్యాంకులో డిడి తీసి కవరింగ్‌ లెటర్‌తో కలిపి డిప్యూటీ ఈవో, పుస్తక ప్రచురణల విక్రయ విభాగం, ప్రెస్‌ కాంపౌండ్‌, KT రోడ్‌, తిరుపతి అనే చిరునామాకు పంపాల్సి ఉంటుంది. తపాలా శాఖ ద్వారా భక్తులకు టిటిడి క్యాలెండర్‌, డైరీలను పంపడం జరుగుతుంది. రవాణా ఛార్జీలను అదనంగా తపాలా శాఖకు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే క్యాలెండర్‌, డైరీలకు సంబంధించిన ఇతర సమాచారం కోసం 0877-2264209 నంబర్లలో సంప్రదించవచ్చని టీటీడీ తెలిపింది.

 

Share to...