Home » Andhra Pradesh » భువనేశ్వరి స్ఫూర్తిదాయక ప్రయాణం

భువనేశ్వరి స్ఫూర్తిదాయక ప్రయాణం

Published By: BharattodayTV Team
Published On
IND vs SA T20

నారా భువనేశ్వరి( Nara Bhuvaneswari ).. పరిచయం అక్కర్లేని పేరు ఇది. దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కుమార్తె. ఈ రాష్ట్రానికి సుదీర్ఘకాలం పాలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి. అయితే ఆమె వీటితోనే ఆగిపోలేదు. వ్యాపార, స్వచ్ఛంద,, సేవా కార్యక్రమాల్లో సైతం ముందుంటున్నారు. హెరిటేజ్ ఫుడ్స్ ఎండిగా తనదైన ముద్ర చాటుకున్నారు.. ప్రస్తుతం ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే ఇటీవల ఆమె ప్రతిష్టాత్మక అవార్డులకు ఎంపిక కావడం గమనార్హం. తాజాగా ఇండియన్ డైరీ అసోసియేషన్ అవుట్ స్టాండింగ్ డెయిరి ప్రొఫెషనల్ అవార్డును నారా భువనేశ్వరికి ప్రధానం చేసింది. కేరళలో జరిగిన సదరన్ డెయిరీ కాంక్లేవ్ లో ఆమె ఈ పురస్కారాన్ని అందుకున్నారు.

* అరుదైన గుర్తింపు..

 ప్రస్తుతం హెరిటేజ్ ఫుడ్స్ ( Heritage foods )లిమిటెడ్ వైస్ ఛైర్మన్ గా, మేనేజింగ్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు నారా భువనేశ్వరి. భారత డైరీ పరిశ్రమ అభివృద్ధికి ఆమె అందిస్తున్న అసమాన సేవలకు గుర్తింపుగా ఇండియన్ డైరీ అసోసియేషన్ ఆమెకు ప్రతిష్టాత్మకమైన అవుట్ స్టాండింగ్ డిగ్రీ ప్రొఫెషనల్ అవార్డు 2025 ను ప్రదానం చేసింది. మొన్న ఆ మధ్యన లండన్ లో ప్రతిష్టాత్మకమైన రెండు అవార్డులను అందుకున్నారు భువనేశ్వరి. కార్యక్రమానికి చంద్రబాబు కూడా హాజరయ్యారు. ఇప్పుడు తాజాగా భువనేశ్వరి ఈ ప్రతిష్టాత్మక అవార్డును కేరళలోని కోజికోడ్ లో ఉన్న కాలికట్ రేట్ సెంటర్లో ఈ అవార్డును అందుకున్నారు. కేరళ పశుసంవర్ధక శాఖ మంత్రి చించు రాణి ఈ అవార్డును అందించారు. దీనిపై భువనేశ్వరి ఎమోషనల్ గా స్పందించారు. తనకు లభించిన ఈ గౌరవాన్ని ఏపీలోని వేలాదిమంది పాడి రైతులకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. రైతుల సహకారం, కష్టంతోనే హెరిటేజ్ ఫుడ్స్ ఈ స్థాయికి చేరుకుందని స్పష్టం చేశారు. నారా భువనేశ్వర్ కి అవార్డుపై ఆమె భర్త, ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. పాడి రైతుల అభ్యున్నతి, మహిళా సాధికారత కోసం భువనేశ్వరి చేస్తున్న కృషి స్ఫూర్తిదాయకమని కొనియాడారు.

 * దశాబ్దాలుగా సేవలు..

 దశాబ్దాలుగా హెరిటేజ్ డైరీలో కీలక పాత్ర పోషిస్తున్నారు నారా భువనేశ్వరి. డైరీ రంగంలో నాణ్యత, పారదర్శకతను ప్రోత్సహించడంలో ఆమె పాత్ర మరువలేనిది. పాడి రైతులకు న్యాయమైన ధరలు కల్పించడంతోపాటు సమయానికి చెల్లింపులు జరిగేలా ఆమె పటిష్టమైన వ్యవస్థను రూపొందించారు. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు పాల ఉత్పత్తి, ప్రాసెసింగ్, మార్కెటింగ్ లో శిక్షణ ఇచ్చి.. వారిని ఆర్థికంగా స్వతంత్రులను చేయడంలో ఆమె విజయం సాధించారు. డైరీ రంగంలో అత్యాధునిక టెక్నాలజీని ప్రవేశపెట్టి హెరిటేజ్ బ్రాండ్ ను దేశవ్యాప్తం చేయడంలో ఆమె సక్సెస్ అయ్యారు. అందుకే వరుసగా ప్రతిష్టాత్మక అవార్డులకు ఎంపికవుతున్నారు.

Share to...