వెబ్ సిరీస్ చూసి భర్త దారుణ హత్య: కర్నూలు జిల్లాలో ప్రియుడితో కలిసి భార్య ఘాతుకం!
అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని.. భర్తను చంపి, పెట్రోల్ పోసి తగలబెట్టిన భార్య!
తొమ్మిదేళ్ల బంధం.. ముగ్గురు పిల్లలు.. అయినా ప్రియుడి కోసం భర్తను హతమార్చిన కిరాతక భార్య!
చాపలో చుట్టి.. బైక్‌పై తీసుకెళ్లి.. శివారులో భర్త శవాన్ని తగలబెట్టిన వైనం!
Bharattoday :వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. కట్టుకున్న భర్తను అడ్డుతొలగించుకోవాలని చూసిన భార్య, తన ప్రియుడితో కలిసి వెబ్ సిరీస్ చూసి పథకం ప్రకారం హత్య చేసి పెట్రోల్ పోసి మృతదేహాన్ని కాల్చిన ఉదంతం కర్నూలు జిల్లాలో సంచలనం రేకెత్తించింది.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం ఎర్రకోట గ్రామ శివారులో ఉన్న ఓ పొలంలో ఈ నెల 23 వ తేదీ ఓ మృతదేహం లభ్యం కాగా,ఆ హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివరాల్లోకి వెళితే ఎమ్మిగనూరు పట్టణంకు చెందిన పద్మ కు పెద్దనెలాటూరు గ్రామానికి చెందిన నరేంద్ర కు తొమ్మిది సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గురు సంతానం ఉన్నారు. పద్మ అదే గ్రామానికి చెందిన వంశీ అనే యువకుడుతో వివేహతర సంబంధం పెట్టుకొది.విషయం తెలుసుకున్న భర్త నరేంద్ర ఎన్నో సార్లు భార్య పద్మ ను మందలించిన పెద్దల సమక్షంలో పంచాయతీ చేసిన, భార్య ప్రవర్తన మారకపోవడంతో, వీరి కాపురం ను ఎమ్మిగనూరుకు మార్చి జీవనం సాగిస్తున్నారు.
# ఊరు మారినా…
నరేంద్ర పని నిమిత్తం వెళ్ళగానే వంశీ వస్తునట్టు తెలియడంతో భార్యాభర్తల మధ్య పెద్ద గొడవ జరిగి విడాకుల వరకు వెళ్లారు . అయితే నరేంద్ర మాత్రం తాను కాపురం చేయాలని భార్యను కోరగా భర్త ఉంటే ఇద్దరు సుఖంగా ఉండలేమని భావించి పథకం ప్రకారం చంపిన ఆనవాళ్లు కనపడకుండా ఉండాలని వెబ్ సిరీస్ ను చూసి నరేంద్ర ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ప్రియుడు వంశీ , పద్మలు కలిసి గొంతుపై కత్తితో పొడిచి మెడను నిలిమి దారుణంగా హత్య చేశారు. అయితే ఎవరికి అనుమానం రాకూడదని హత్య చేసిన స్థలంలో రక్తపు మరకలను తుడిచివేసి , ఓ ప్లాస్టిక్ సంచిలో మృతదేహాన్ని కుక్కి బైక్ పై ఊరి శివారులోని ఓ పొలంలో మృతదేహం పై పెట్రోల్ పోసి నిప్పంటించి నట్టు పోలీసులు తెలిపారు.



