అనంతపురం నగరానికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ రామసుబ్బయ్య కన్నుమూశారు. విషయం తెలిసిన వెంటనే జిల్లాలోని మాజీ సైనికులు రామ్ నగర్ లోని వారి ఇంటికి వెళ్లి నివాళులు అర్పించారు. డాక్టర్ రామసుబ్బయ్య గారి ఆత్మకు శాంతి చేకూరాలని అనంతపురం జిల్లా మాజీ సైనికుల సంఘం జిల్లా అధ్యక్షులు కెప్టెన్ షేకన్న అధ్యక్షతన మరియు డాక్టర్ రామసుబ్బయ్య గారి కుమారుడు లెఫ్ట్నెంట్ జనరల్ వై.వి.కె మోహన్ తో కలిసి సంఘ సభ్యులు తోపాటు నివాళులర్పించడం జరిగింది. డాక్టర్ రామసుబ్బయ్య కుమారుడు లెఫ్ట్నెంట్ జనరల్ వై వి కె మోహన్ మాజీ సైనికుల సంఘం కోసం ఎంతో సహాయం చేశారు. ముఖ్యంగా ఈ సి హెచ్ ఎస్ పాలి క్లినిక్ స్థలం కొనడానికి ఫండ్స్ రావడానికి గాని మరియు ఈసీహెచ్ఎస్ హాస్పిటల్ మంజూరు చేయించడానికి వారు ఢిల్లీలో సర్వీస్ లో ఉన్నప్పుడు మన ఉమ్మడి జిల్లా మాజీ సైనికులకు ఎంతో సహాయం చేసినట్లు కెప్టెన్ షేకన్న తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రెజరర్ తిమ్మారెడ్డి, రవికుమార్, వెంకట సుబ్బరాజు ,కృష్ణ, అబ్దుల్ ఖాదర్, ఉసేన్, ప్రసాద్, సిద్ధన్న , బషీర్ తదితరులు పాల్గొన్నారు.



