1. మీ ఇంట్లో 15-30 ఏళ్ళ అమ్మాయి / యువతి ఉందా ?
2. పది …. ఇంటర్ దాక ఆమె చదువులో చురుకయ్యిందా ?
3.తెలివితేటలు , independent భావాలు ఆమెలో మెండుగా ఉన్నాయా ?
4. గత కొంత కాలంగా ఆమె ప్రవర్తన చిత్రంగా మారిందా ?
5. గది తలుపేసుకొని , ఒంటరిగా గడపడానికి ఇష్టపడుతోందా ?
6. మీ పై కోపం చిరాకు ప్రదర్శిస్తోందా ?
7. అబద్దాలు చెప్పడం , ఆత్మ హత్య చేసుకొంటానని బెదిరిస్తోందా ?
అయితే ఆమె ఆమెకు కొరియన్ దెయ్యం పట్టినట్టే !
దెయ్యాలు లేవు .
ఇది వేరే రకం దెయ్యం !
ఇప్పటిదాకా పెద్దగా ఎవరూ రాయని , మాట్లాడని భూతం .
భారత దేశం లో లక్షలాది మంది యువ మహిళలకు పట్టిన దెయ్యం .
మీ వయసు .. 40 ప్లస్ ..
చెప్పండి .. కొరియా గురించి మీకు ఏమి తెలుసు ?
జస్ట్ ఒకటి రెండు పాయింట్స్ కదా ?
మీకు తెలియని ఎన్నో విషయాలు ఇవిగో ,… అంటూ తల్లిదండ్రులను సమాజాన్ని హెచ్చరించారు ప్రముఖ విద్యావేత్త వాసిరెడ్డి అమర్నాథ్.
భారతీయ అమ్మాయిలు కొరియా డ్రామాలకు , పాప్ మ్యూజిక్ కు పిచ్చ ఫాన్స్ .
పచ్చ బొట్టు పొడిపించుకొన్న వారు .. కొరియా భాషను నేర్చుకొంటున్న వారు ..
కొరియా ఫాన్స్ కమ్యూనిటీ ఆన్లైన్ గ్రూప్స్ తో ఇస్టన్గ్రామ్ ట్విట్టర్ రెడ్దిట్ నిండి పోయింది .
ఈ ఫాన్స్ గ్రూప్స్ ఈవెంట్స్ నిర్వహిస్తారు .
ప్రసంగాలిస్తారు .
ఇదొక మేనియా .. పెద్దవారికి పెద్దగా తెలియని మేనియా .. సమస్యకు మూలం !. ఇండియన్ మెయిన్ స్ట్రీమ్ సినిమా.. హీరో ఓరియెంటెడ్. కాలం మారింది . చదువుల్లో, కాంపిటేటివ్ పరీక్షల్లో, ఉద్యోగాల్లో… మహిళలదే పై చేయి .
అయినా భారతీయ సినిమా మారలేదు . హీరో తెలివైనోడు ..హీరోయిన్ జస్ట్ ఒక అందాల బొమ్మ .. ఆమెకు వ్యక్తిత్వం ఉండదు .. తెలివి ఉండదు .రాస్తూ పొతే భారతీయ సినిమా లో పురుషాధిక్య సంస్కృతి గురించి ఒక పుస్తకం అవుతుంది .
కొరియన్ సినిమా .. పాప్ మ్యూజిక్ :అమ్మాయి తెలివైంది .. ధైర్యవంతురాలు .. సమస్యల్ని ఎదిరిస్తుంది .. పోరాడుతుంది ..
ఎక్కడైతే భారతీయ సినిమాలో గాప్ ఉందొ ..కొరియన్ డ్రామా అక్కడే దూరింది . కొరియన్ సినిమా లో చూపించే సమస్యలు నిజం .. యువ మహిళా కోణం లో ఈ సినిమా లు, డ్రామాలు … అద్భుత చిత్రీకరణలు .
హీరో హీరోయిన్ స్లిమ్ గా అందంగా ఉంటారు ..చిత్రీకరణ సూపర్ రిచ్ . లేటెస్ట్ కెమెరాలు .. ట్రేండింగ్ మ్యూజిక్ .. స్టూడియోస్ ..మగాళ్లకు హింసంటే ఇష్టం . మహిళలకు అది పెద్దగా నచ్చదు . ఫామిలీ డ్రామా , రొమాన్స్ , చదువు ..ఉద్యోగం ..అక్కడ మహిళా ఎదుర్కొనే సమస్యలు .. పురుషాధిక్యత … వాటిని ఎదిరించడం ..
ఇలా యువ మహిళ ఆలోచించే ప్రతి అంశం ఇందులో ఉంటుంది .ఒక్క మాటలో చెప్పాలి అంటే యువ మహిళ మనోగతానికి కొరియన్ డ్రామా ప్రతిబింబం .
మరి సమస్య ఎక్కడొచ్చింది ?
1. ఇందులో చూపే సమస్యలు నిజం.
దానికి వారు చూపే పరిష్కారం డ్రమాటిక్ గా వాస్తవానికి ఆమడ దూరం లో ఉంటుంది .
యువమహిళల్లో ఇది పలాయన వాదానికి దారి తీస్తోంది .
2. ఇదొక పెద్ద అడిక్షన్ . ఒక్కసారి దూరితే బయటకు రాలేరు . అదేపనిగా గంటలు, గంటలు చూస్తూ కాలం గడిపేస్తారు .
4. విపరీత భావోద్వేగాలు వచ్చేస్తాయి . కోపం .. మానసిక కుంగుబాటు .. స్ట్రెస్ .. ఆత్మ హత్య ఆలోచనలు .. నేల విడిచి సాము చెయ్యడం .. పలాయన వాదం .
5. మనం కూడా కొరియన్ బ్యూటీ లా మారాలి ! వారిది మంగోలాయిడ్ జాతి ! ఇక్కడ బయాలజీ వేరు !
ప్లాస్టిక్ సర్జరీ లు .. సిలికాన్ ఇంజెక్షన్స్
మన బాయ్ ఫ్రెండ్ కొరియన్ అబ్బాయిలా హ్యాండ్సమ్ గా ఉండాలి .. బ్రాడ్ మైండెడ్ గా ఉండాలి : ఇక్కడ సరుకు వేరు
వాస్తవానికి వెయ్యి మైళ్ళ దూరం లో ఆలోచనలు ఆకాంక్షలు !
అవి తీరక నిరాశా నిస్పృహలు
ఈ సినిమాలు తీసే దక్షిణ కొరియా కు ఒక్క సారి వెళుదాము .
అమ్మాయిలు పెళ్ళొద్దు అంటున్నారు . పెళ్లి నాటికి సగటు వయస్సు 32 .
“పెళ్లి మెడకు జంజాటం . లైఫ్ లో రొమాన్స్ ఉంటే చాలు “అనుకొనే వారి సంఖ్య పెరిగిపోతోంది .
కొరియన్ యువతుల ఎంజోయ్మెంట్ కోసం కొన్ని పొరుగు దేశాల్లో బాయ్స్ స్త్రీట్స్ వెలుస్తున్నాయి .
2.1 ఉండాల్సిన జనన రేట్ 0.75 కి పడిపోయింది .
వృద్ధుల శాతం పెరిగిపోతోంది . పని చేసే వారి సంఖ్య భారీగా తగ్గి ఆర్థిక మాంద్యం .
కొరియన్ డ్రామాకు పాప్ మ్యూజిక్ కు … అమ్మాయిలేనా ఫాన్స్ ?
అబ్బాయిల / యువకుల కు పట్టిన దెయ్యాలు వేరు .. బెట్టింగ్ .. గంజాయి .. హింస .. శాడిజం .. బుల్లియింగ్ .
కొరియన్ ఫాన్స్ లో 90 శాతం అమ్మాయిలే !
పరిష్కారం :
సమాజం నిద్ర లేవాలి .
మహిళకు సముచిత స్థానం ఇవ్వాలి .
సమస్యల చిత్రీకరణ సరే ..సరైన పరిష్కారం ఇచ్చే సినిమాలు రావాలి .
సినిమా వేరు .. జీవితం వేరు .. సమస్య వాస్తవం అయితే పరిష్కారం కూడా వాస్తవం కావాలి అనే ఇంగిత జ్ఞానం అందరికీ ముఖ్యంగా యువతకు విద్యార్థులకు రావాలి .విద్య వ్యవస్థ మారాలి .
ముగింపు :ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్న అమ్మాయి . కాలేజీ కి పోనంటోంది . ఇంజనీరింగ్ అంటే నాకు ఇష్టం లేదు . బెంగుళూరు లో బేకరీ కోర్స్ చేస్తా . ఆరు నెలల కోర్స్ .. జస్ట్ అయిదు లక్షలు ఫీజ్ . అంటోంది. తల్లితండ్రి బతిమాలాడారు . ఇంజనీరింగ్ జస్ట్ ఒక ఇయర్ . ఇది కంప్లీట్ చెయ్యి . అటుపైన హోటల్ మానేజ్మెంట్ పీజీ చేద్దువు అన్నారు .
ఒప్పుకోదు . కోపం .. అన్నం తినడానికి మాత్రం తలుపు తీసి బయటకు వస్తుంది . మానసిక వైద్యుడి వద్దకు తీసుకొని వెళ్లారు . ఆయన నాలుగు పేజీ ల లిస్ట్ రాసారు .. పరిష్కారం కాదు . నాలుగు పేజీల వ్యాసం .. సమస్య గురించి .
పరిష్కారం .. ఒక ఒక్కటీ అడక్కు అన్నాడేమో ..పేరెంట్స్ నిరాశానిస్పృహల్లో .. ఆరోగ్యం చెడగొట్టు కొంటూ ..కొరియన్ దెయ్యం దించాలి . వేప మండలు .. కాదు .. కీలెరిగి వాత పెట్టాలి … అంటూ తనదైన శైలిలో ముగించారు అమర్నాథ్.



