Home » Telangana » సిద్దిపేటలో ప్రగతి పండుగ: ఆయిల్ పామ్ కర్మాగారాన్ని ప్రారంభించి, ‘రైతు భరోసా’ నిధులు విడుదల చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి

సిద్దిపేటలో ప్రగతి పండుగ: ఆయిల్ పామ్ కర్మాగారాన్ని ప్రారంభించి, ‘రైతు భరోసా’ నిధులు విడుదల చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి

Published By: BharattodayTV Team
Published On
IND vs SA T20

హైదరాబాద్ భారత్ టుడే:   ప్రజా పాలనలో రైతు ఉత్సవాలు కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  ఈరోజు సిద్ధిపేట జిల్లా నర్మెట్టలో ఆయిల్ పామ్ కర్మాగారాన్ని ప్రారంభించి రాష్ట్ర రైతులకు అంకితం చేయనున్నారు. దీంతో పాటు రిఫైనరీ యూనిట్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు.

✅ వీటితో పాటు సిద్ధిపేట జిల్లాలో రూ. 775.72 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి  మంత్రులతో కలిసి శంకుస్థాపన చేస్తారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతారు. అక్కడ పెట్టుబడి సాయం *రైతు భరోసా* నిధులను విడుదల చేస్తారు.

✅ రూ.300 కోట్లతో నంగునూరు మండలం నర్మెట్టలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం.

✅ రూ.141.34 కోట్లతో సిద్దిపేట మున్సిపాలిటీలో నీటి సరఫరా, భూగర్భ డ్రైనేజీ ప్రాజెక్టులకు శంకుస్థాపన.

✅ రూ.78 కోట్లతో ఎన్సాన్‌పల్లిలో జిల్లా జైలు భవనం ప్రారంభోత్సవం.

✅ రూ.15 కోట్లతో ఎన్సాన్‌పల్లిలో 50 పడకల సమీకృత ఆయుష్ ఆసుపత్రి ప్రారంభోత్సవం.

✅ రూ.3.60 కోట్లతో ఎన్సాన్‌పల్లిలో సెంట్రల్ మెడిసిన్ స్టోర్ ప్రారంభోత్సవం.

✅ రూ.1.43 కోట్లతో నంగునూరు మండలం గట్లమల్యాలలో PHC భవనం ప్రారంభోత్సవం.

✅ రూ.1.43 కోట్లతో సిద్దిపేట మున్సిపాలిటీలోని అంబేద్కర్ నగర్ లో నిర్మించిన UPHC భవనం ప్రారంభోత్సవం.

➡️ *గజ్వేల్* నియోజకవర్గంలో శంకుస్థాపనలు/ ప్రారంభోత్సవాల వివరాలు:

✅ రూ.200 కోట్లతో కొండపాకలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్‌కు శంకుస్థాపన.

✅ రూ.16.62 కోట్లతో మర్కూక్‌లోని తెలంగాణ పబ్లిక్ స్కూల్‌లో అదనపు మౌలిక సదుపాయాలకు శంకుస్థాపన.

✅ రూ.8.65 కోట్లతో మర్కూక్‌లో సమీకృత మండల కార్యాలయాల సముదాయం (IOC) ప్రారంభోత్సవం

✅ రూ.9.65 కోట్లతో జగదేవ్‌పూర్‌లో సమీకృత మండల కార్యాలయాల సముదాయం (IOC) ప్రారంభోత్సవం అనంతరం ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. 

 

Share to...