Home » Telangana » Kcr: అసెంబ్లీకి కెసిఆర్.. నీళ్ల రాజకీయాలతో నిలదొక్కుకునే ప్రయత్నం!

Kcr: అసెంబ్లీకి కెసిఆర్.. నీళ్ల రాజకీయాలతో నిలదొక్కుకునే ప్రయత్నం!

Published By: BharattodayTV Team
Published On
IND vs SA T20

అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్( KCR) హాజరవుతారా? సీఎం రేవంత్ ను నిలదీస్తారా? నీళ్ల మంటలు రేగనున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. ఈరోజు నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు కేసిఆర్ హాజరయ్యే చాన్స్ కనిపిస్తోంది. ఇప్పటికే అసెంబ్లీ శీతాకాల సమావేశాలను 15 రోజుల పాటు నిర్వహించాలని డిమాండ్ చేశారు కెసిఆర్. దానిపై పోరాటం చేయాలని పార్టీ ఎమ్మెల్యేలకు సూచించారు.

 2023లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. దాదాపు రెండేళ్లు అవుతోంది. ఒకే ఒక్కసారి అసెంబ్లీకి వచ్చారు కెసిఆర్. అది కూడా ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసేందుకు. ప్రమాణం చేసిన తర్వాత ఎన్నడూ లేని విధంగా అసెంబ్లీ మీడియా పాయింట్ కు( assembly media point) వెళ్లారు. ఇకపై కాంగ్రెస్ ప్రభుత్వం పై యుద్ధమే అన్నట్లు మాట్లాడారు.. చాలా సందర్భాల్లో గట్టి ప్రకటనలే చేశారు. కానీ ఇంతవరకు అసెంబ్లీకి హాజరైంది లేదు. అయితే ఈసారి మాత్రం తప్పకుండా హాజరవుతారని తెలుస్తోంది. ఎందుకంటే అనర్హత వేటు అంశం తెరపైకి రావడంతో.. ఆయన సభకు హాజరయ్యేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

 కెసిఆర్ కు రేవంత్ రెడ్డిది దశాబ్దాల వైరం. తనను బాగా ఇబ్బంది పెట్టారని రేవంత్ మనసులో ఉంది. పాలమూరు జిల్లా నుంచి వచ్చారు రేవంత్ రెడ్డి. 2009లో కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ సమయంలోనే మహబూబ్నగర్ ఎంపీ అయ్యారు కెసిఆర్. విశేషం ఏంటంటే ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంది టిఆర్ఎస్. కొడంగల్ నుంచి టిడిపి ఎమ్మెల్యేగా రేవంత్, మహబూబ్నగర్ నుంచి టిఆర్ఎస్ ఎంపీగా కేసీఆర్ ఎన్నికయ్యారు. అయితే ఎంపీగా ఉండగానే ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారు కేసీఆర్. 2014 ఎన్నికల్లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన రేవంత్ కెసిఆర్ ప్రభుత్వం పై పోరాటం చేయడం ప్రారంభించారు. అలా వారిద్దరి మధ్య దశాబ్ద వైరం నడిచింది. ఈ క్రమంలో కేసీఆర్ రేవంత్ రెడ్డిని అరెస్టు చేయించారు. 

 కెసిఆర్ పెట్టిన ఇబ్బందులతో రేవంత్ తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ జెండా అందుకున్నారు. అంచలంచెలుగా ఎదుగుతూ ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్నారు. అయితే తనను గద్దె దించి రేవంత్ అధికారంలోకి రావడం ఎంత మాత్రం జీర్ణించుకోలేకపోయారు కేసీఆర్. తనకంటే జూనియర్ సీఎంగా అయ్యే సరికి సభకు హాజరు కావడం మానేశారు. అయితే దశాబ్దాల వైరం వారి మధ్య ఉండడంతో.. కెసిఆర్ సభకు వస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

 తెలంగాణలో నీళ్ల రాజకీయం ద్వారా మళ్ళీ నిలదొక్కుకోవాలని గట్టి ప్రయత్నం లో ఉన్నారు కెసిఆర్. అందుకే పాలమూరు- రంగారెడ్డి సాగునీటి ప్రాజెక్టు కోసం ఇప్పుడు గళం ఎత్తుతున్నారు. తద్వారా పాలమూరులో రేవంత్ రెడ్డిని దెబ్బతీయాలని భావిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలన్న డిమాండ్ ఒకవైపు, అనర్హత వేటు పడుతుందన్న భయం మరోవైపు.. ఈ కారణాలతోనే కెసిఆర్ సభకు హాజరవుతారని తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో?

Share to...