తెలంగాణలో ( Telangana) రేవంత్ సర్కార్ దూకుడుగా ఉందా? త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరపనుందా? పంచాయితీ ఎన్నికల ఫలితాలతో ఈ నిర్ణయానికి వచ్చిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇటీవల జూబ్లీహిల్స్ బైపోల్లో కాంగ్రెస్ గెలిచింది. మూడు విడతల్లో జరిగిన 12 వేల సర్పంచ్ స్థానాల్లో గట్టి పట్టు సాధించింది. 90 శాతానికి పైగా పంచాయతీల్లో బాగా వేసేందుకు ప్రయత్నించింది. అయితే మెజారిటీ సర్పంచ్ స్థానాలను అధికార కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంది. కానీ అనుకున్న స్థాయిలో రాకపోవడం చర్చకు దారితీసింది. అనూహ్యంగా టిఆర్ఎస్ పుంజుకోవడం మాత్రం అధికార పార్టీలో చిన్నపాటి కుదుపు.
* మూడో విడతనాటికి తగ్గిన శాతం..
మొదటి విడతలో 67% సర్పంచ్ పదవులను సొంతం చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. కానీ మూడు విడతలు ముగిసే సరికి 52 శాతానికి పడిపోయింది. అనుకున్న దానికంటే కాంగ్రెస్ వెనుకబడితే.. టిఆర్ఎస్ మాత్రం ఊహించిన దానికంటే పుంజుకోవడం హాట్ టాపిక్ అవుతుంది. గొప్ప అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు మంచి ఫలితాలు వచ్చిన గ్రామీణ ప్రాంతాల్లోనే బిఆర్ఎస్ మెల్లమెల్లగా పుంజుకోవడం పంచాయితీ ఎన్నికల ద్వారా స్పష్టమైంది. దీంతో ప్రాదేశిక ఎన్నికలు వాయిదా వేసి ప్లాన్ బి అమలు చేసే ఆలోచనలో పడిందట కాంగ్రెస్.
పంచాయితీ ఎన్నికల్లో అనుకోని విధంగా మంచి రిజల్ట్స్ వస్తే వెంటనే ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికలు పెట్టాలని అనుకున్నారు. అయితే 90 శాతం టార్గెట్ పెట్టుకుంటే 50 శాతానికి పరిమితం అయింది పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రాదేశిక ఎన్నికలు పెట్టడం కంటే మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేశాక ఎన్నికలకు వెళ్లాలని అనుకుంటుందట.
పంచాయితీ ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్ ప్రాదేశిక ఎన్నికలపై పడిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. సర్పంచి ఎన్నికల్లో సత్తా చాటామని చెప్తూ మీడియా సమావేశంలో మాట్లాడిన సీఎం రేవంత్.. ప్రాదేశిక ఎన్నికలు ఎప్పుడు పెడతారన్న దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అయితే పంచాయతీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను చూసి కాంగ్రెస్ పెద్దలు షాక్కు తిన్నారని ఒక ప్రచారం నడుస్తోంది. అందుకే సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రాదేశిక ఎన్నికలకు వెళ్లాలన్నది ప్రణాళికగా తెలుస్తోంది. ముఖ్యంగా వృద్ధులకు అందజేసే పెన్షన్ పెంపు, రైతు భరోసా నిధులను మరోసారి విడుదల చేసిన తరువాత ఎన్నికలకు వెళ్తే బాగుంటుందనే ఆలోచనలో కాంగ్రెస్ సర్కారు ఉన్నట్లు సమాచారం. అయితే ఇంతలో పట్టణ ప్రాంతాలకు సంబంధించిన మున్సిపల్ ఎన్నికలను నిర్వహించాలని ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే పంచాయితీ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ పార్టీ ఆలోచన మారింది.



