Home » Telangana » KTR: కేటీఆర్ కు తగిలిన ‘పంచాయతీ’ దెబ్బ.. సిరిసిల్లలో నిత్య పర్యటనలు!

KTR: కేటీఆర్ కు తగిలిన ‘పంచాయతీ’ దెబ్బ.. సిరిసిల్లలో నిత్య పర్యటనలు!

Published By: BharattodayTV Team
Published On
IND vs SA T20

తెలంగాణలో( Telangana) గులాబీ పార్టీ సంక్లిష్ట పరిస్థితుల్లో ఉంది. గడ్డు పరిస్థితులను ఎదుర్కొంది. ఉద్యమ పార్టీ నుంచి పాలక పార్టీగా మారిన తరువాత గులాబీ పార్టీకి తిరుగులేకుండా పోయింది. పదేళ్లలో ఆ పార్టీ దూసుకుపోయింది. అయితే ఇప్పుడు విపక్షంలో తడబడుతోంది. నిలబడే ప్రయత్నం చేస్తోంది. అదే సమయంలో గులాబీ పార్టీ పెద్దల నియోజకవర్గాలపై ఫోకస్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఎట్టి పరిస్థితుల్లో అక్కడ పెద్ద నేతలను దెబ్బ కొట్టాలని భావించింది. సర్పంచ్ ఎన్నికల్లో చేసి చూపించింది. దీంతో బిఆర్ఎస్ ముఖ్య నేతల్లో ఒక రకమైన భయం ప్రారంభమైంది. అందుకే వారు తమ సొంత నియోజకవర్గం.

 * కేవలం పోటీ మాత్రమే.. 

 ప్రధానంగా సిరిసిల్ల( sirisilla) నియోజకవర్గంపై దృష్టి సారించారు కేటీఆర్. మొన్నటి పంచాయితీ ఎన్నికల్లో కేవలం అక్కడ గులాబీ పార్టీ పోటీ మాత్రమే ఇచ్చింది. మెజారిటీ పంచాయతీలను చేజిక్కించుకోలేకపోయింది. దీంతో భయపడిపోతున్నారు కేటీఆర్. పునాదులు కదులుతున్నాయని గుర్తించారు. అందుకే అక్కడ పార్టీని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వారం వారం పర్యటనలు చేస్తూ ప్రజలకు దగ్గర ఎందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మునుపెన్నడూ లేని విధంగా కేటీఆర్ పర్యటనలు సిరిసిల్లలో కొనసాగుతుండడం విశేషం.

* ఎన్నికల్లో పనిచేయని అభివృద్ధి..

 సిరిసిల్ల నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చేశానని భావిస్తున్నారు కేటీఆర్( kalvakuntla Taraka Rama Rao ). తరచూ ఈ రకమైన ప్రకటనలే చేస్తున్నారు. అయితే ఎన్నికల రాజకీయాల్లో ఇవి ఎంత మాత్రం వర్కౌట్ అయ్యే ఛాన్స్ లేదు. ఎందుకంటే అప్పుడు స్థానిక రాజకీయ సమీకరణలు పనిచేస్తాయి. కేవలం రాజకీయ పార్టీల ప్రభావం మాత్రమే అసెంబ్లీ ఎన్నికల్లో ఉంటుంది. అయితే మొన్ననే జరిగిన పంచాయితీ ఎన్నికల్లో సిరిసిల్ల నియోజకవర్గంలో గులాబీ పార్టీ వెనుకబడిపోయింది. పోటీ అయితే ఇచ్చింది కానీ.. మెజారిటీ స్థానాలను దక్కించుకోలేకపోయింది. అయితే ఇప్పుడు స్థానిక నాయకులు, ద్వితీయ శ్రేణి నాయకత్వం అవసరాల కోసం ఇతర పార్టీల్లో చేరేందుకు ప్రయత్నాలు చేసింది. ఆ చేరికలకు అడ్డుకట్ట వేయాలన్న ఆలోచనతో ఉన్నారు కేటీఆర్. అందుకే తరచూ సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటనలు చేస్తున్నారు.

 * ప్రాదేశిక ఎన్నికల కోసం..

 పదేళ్ల కాలంలో బిఆర్ఎస్( BRS) అధికార పార్టీగా ఉంది. పార్టీతో పాటు ప్రభుత్వంలో కీలకపాత్ర పోషించారు కేటీఆర్. కానీ నెల రోజులకు ఒకసారైనా తన సొంత నియోజకవర్గం సిరిసిల్ల వచ్చేవారు కాదు. ఎప్పుడైతే మొన్న పంచాయతీ ఎన్నికల్లో దెబ్బ తగిలిందో.. అప్పటి నుంచి నియోజకవర్గంలో తరచూ పర్యటనలు చేస్తున్నారు. కార్యకర్తల ఇళ్ళకు వెళ్తున్నారు. రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నారు. త్వరలో ప్రాదేశిక ఎన్నికలు జరగనున్నాయి. సిరిసిల్ల నియోజకవర్గంలో అన్ని మండలాల ఎంపీపీలు, జడ్పిటిసిలు దక్కించుకోవాలంటే కేటీఆర్ కు ఇబ్బందికరమే. ఇన్ని రోజులు వెలగబెట్టిన అధికారం, కట్టుకున్న పునాదులు కొట్టుకుపోతాయన్న భయం కేటీఆర్ లో ఉంది. అందుకే సిరిసిల్ల నియోజకవర్గంలో నిత్య పర్యటనలు చేస్తున్నారు.

Share to...