ఎయిర్ పోర్టు రాకతో.. విజయనగరంలో మారుతున్న పొలిటికల్ సీన్!
విజయనగరం( Vijayanagaram) జిల్లాలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో అందరి దృష్టి ఇప్పుడు విజయనగరం పైనే ఉంది. అందుకే అక్కడ రాజకీయాన్ని పదిల పరుచుకోవాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. చాలా రకాల ప్రయోగాలకు వేదిక కానుంది