SMRITI MANDANA : భారత స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి రద్దు అయింది. తన వివాహం రద్దయినట్లు ఆమె ఇన్‌స్టా స్టోరీలో ప్రకటించారు. గత కొన్ని వారాలుగా తన వ్యక్తిగత జీవితంపై అనేక ఊహాగానాలు వస్తున్నాయని… కానీ ఈ విషయాన్ని ఇక్కడితో ముగించాలనుకుంటున్నానని తన ఇన్ స్టా స్టోరీలో స్మృతి రాసుకొచ్చింది. ఇరు కుటుంబాల ప్రైవసీకి గౌరవం ఇవ్వండని విజ్ఞప్తి చేసింది. ఇక నుంచి తన క్రికెట్ కెరీర్‌పై దృష్టి పెట్టబోతున్నట్లు స్పష్టం చేసింది. భారత జట్టుకు విజయాలు అందించడమే తన కర్తవ్యమని ఆమె పేర్కొంది. తనకు మద్దతిచ్చిన అందరికీ ధన్యవాదాలు అని ఇక ముందుకు సాగాల్సిన సమయం ఆసన్నమైందని ఆమె పేర్కొంది.

ఇటీవల మ్యూజిక్ డైరెక్టర్ పలాశ్ ముచ్చల్‌తో ఆమె వివాహం వాయిదా పడిన విషయం తెలిసిందే. నవంబర్ 23న జరగాల్సిన పెళ్లి.. పలు కారణాలతో వాయిదా పడింది. అప్పటి నుంచి ఈ వివాహంపై పలు ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో స్మృతి మంధాన తాజాగా పెళ్లి రద్దును ఖరారు చేశారు. మరోవైపు పలాశ్ ముచ్చల్ కూడా పెళ్లి రద్దు చేసుకున్నట్లు ఇన్‌స్టాలో ప్రకటించాడు.



