Home » Nation » BengalElections: బెంగాల్లో బీహార్!.. సర్వేలు ఏం చెబుతున్నాయి

BengalElections: బెంగాల్లో బీహార్!.. సర్వేలు ఏం చెబుతున్నాయి

Published By: BharattodayTV Team
Published On
IND vs SA T20

దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ( Bhartiya Janata Party) హవా నడుస్తోంది. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చింది. దాదాపు అన్ని రాష్ట్రాలను హస్తగతం చేసుకుంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అడుగు పెట్టిన ప్రతిచోట విజయాన్ని దక్కించుకుంటూ ముందుకెళ్తోంది. అయితే 2026 లో మాత్రం గట్టి సవాల్ ను ఎదుర్కోబోతోంది ఆ పార్టీ. కీలకమైన పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బిజెపి గట్టిగానే తలపడబోతోంది తృణమూల్ కాంగ్రెస్తో. కానీ అది అంత ఈజీ కాదు. ఎందుకంటే తాజాగా వస్తున్న ముందస్తు సర్వేల్లో ఇప్పటికీ తృణమూల్ కాంగ్రెస్ బలీయమైన శక్తిగానే ఉందని తేలింది. మరోసారి బిజెపికి ప్రతిపక్ష పాత్ర దక్కనుందని సర్వేలు చెబుతుండడం విశేషం. అయితే వామపక్షాలు- కాంగ్రెస్ కూటమి కనీసం పోటీ ఇవ్వలేని స్థితిలో ఉండడం దయనీయం. ఒకప్పుడు ఆ రెండు పార్టీలు బెంగాల్ ను ఏలాయి. ఇప్పుడు ఉనికి చాటుకునేందుకు కూడా ఇబ్బంది పడుతున్నాయి. అయితే ఈ కూటమి చీల్చే ఓట్లతోనే మమత మరోసారి అధికారంలోకి వస్తారని స్పష్టమవుతోంది.

* ఈ ఏడాదే అసెంబ్లీ ఎన్నికలు..
ఈ ఏడాది పశ్చిమ బెంగాల్( West Bengal) అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడ బిజెపి సత్తా చాటింది. గట్టిగానే ఫైట్ ఇచ్చింది. ఎంపీ స్థానాలను సైతం దక్కించుకుంది. అప్పటినుంచి పశ్చిమ బెంగాల్ తమదేనంటూ సవాల్ చేస్తోంది బిజెపి. కానీ ఎట్టి పరిస్థితుల్లో వదులుకునే అవకాశం ఇవ్వనని మమతా బెనర్జీ తేల్చి చెబుతున్నారు. బిజెపి పై గట్టిగానే ప్రకటనలు చేస్తున్నారు. అయితే తాజాగా వచ్చిన ఓ సర్వేలో మళ్ళీ తృణమూల్ కాంగ్రెస్కే బెంగాల్ ప్రజలు పట్టం కట్టబోతున్నారు అని స్పష్టమైంది. కానీ పట్టు వదలని విక్రమార్కుడిలా బిజెపి గట్టి ప్రయత్నాలు చేస్తోంది.

* కమ్యూనిస్ట్ కోటలను బద్దలు కొట్టి..
కమ్యూనిస్ట్ ( communist)కోటలను బద్దలుగొట్టి పశ్చిమ బెంగాల్లో అధికారంలోకి వచ్చారు మమతా బెనర్జీ. 35 సంవత్సరాల కమ్యూనిస్టు కోటలను ఢీకొట్టారు మమతా బెనర్జీ. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ని ఏర్పాటు చేశారు. అదే పార్టీని 2011 మే 13న అధికారంలోకి తీసుకొచ్చారు మమతా బెనర్జీ. 2011, 2016, 2021.. ఇలా హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకున్నారు. 294 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న పశ్చిమ బెంగాల్లో.. ప్రతి ఎన్నికల్లోను 200 సీట్లు తగ్గకుండా మెజారిటీ సాధిస్తూ వచ్చారు మమతా బెనర్జీ. ఈసారి కూడా 200 సీట్లు తగ్గవని ముందస్తు సర్వేలు చెబుతుండడం విశేషం.

* బీహార్ ఫలితాలు రిపీట్ అవుతాయని..
మొన్నటి బీహార్( Bihar) ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించింది ఎన్ డి ఏ. బిజెపి గణనీయమైన సీట్లు పెంచుకుంది. జేడీయు సైతం మెజారిటీ స్థానాలను సొంతం చేసుకుంది. ఎన్డీఏ కు ఇండియా కూటమి కనీసం పోటీ ఇవ్వలేకపోయింది. అయితే అటువంటి విజయాన్ని పశ్చిమ బెంగాల్లో సాధిస్తామని ధీమాతో ఉంది బిజెపి. కానీ క్షేత్రస్థాయిలో సర్వేలు మాత్రం అందుకు విరుద్ధంగా వస్తున్నాయి. మరి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండనున్నాయో చూడాలి.

Share to...